వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయని తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు మొదలుకొని సామాన్య కార్యకర్తల వరకు అందరినీ ఏదో ఒక కేసుల పేరుతో వేధింపులకు గురి చేయడం, ఇరుకున పడేయడం వైసీపీ ప్రభుత్వానికి అలవాటైందని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నెల్లూరులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై గుర్తు తెలియని దుండగులు దాడికి ప్రయత్నించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది..
ప్రభుత్వంపై, సీఎం జగన్ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారన్న కారణంతో ఆనం వెంకట రమణారెడ్డిని టార్గెట్ చేసి కొందరు వైసీపీ కార్యకర్తలు దాడికి యత్నించారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.. ఆగి ఉన్న వాటర్ ట్యాంక్ చాటు నుంచి కొందరు వ్యక్తులు కర్రలు పట్టుకుని ఆనం ఇంట్లోకి వెళ్లడం సంచలనం రేపింది. ఆనంపై దాడి చేయడానికి వెళ్ళిన దుండగలు పరుగు పరుగున బయటకు రావడం, వారిని తరుముతూ ఆనం, ఆయన అనుచరులు ఇంటి నుంచి బయటకు రావడం వైరల్ గా మారింది.
ఈ నేపద్యంలోనే ఆనంపై దాడి యత్నం ఘటనను టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఖండించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. తనతో పాటు తన సన్నిహితులను, పార్టీ నేతలను విమర్శిస్తున్న వారి నోరుమూయించేందుకు మరోసారి జగన్ రౌడీ మూకలను ఉసిగొల్పారని చంద్రబాబు మండిపడ్డారు. ఇటువంటి అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్న జగన్ సిగ్గుపడాలని హితవు పలికారు. జగన్ పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని చంద్రబాబు జోస్యం చెప్పారు.
Strongly condemn the cowardly attack on our party leader Anam Venkata Ramana Reddy in Nellore today. Shame on @ysjagan for unleashing his rowdy elements yet again to stifle the voices that question him and his cronies. Very soon, people will put an end to all his anti-democratic… pic.twitter.com/MRxXm802xi
— N Chandrababu Naidu (@ncbn) June 4, 2023