ఏపీలో హిందువులు ఆందోళన చెందుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే అనేక సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా ఏ ఘటనలోను నిందితులు అరెస్టు కాలేదు. దీంతో దీని వెనుక కుట్ర జరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. అయితే, ఈ సంఘటనల్లో ఎక్కడా నిందితులు అరెస్టు చేయకపోవడంపై హిందువులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తుండగా… మరోవైపు చర్చిపై దాడి ఘటనలో ఒక్క రోజు తిరగకుండా 45 మందిని అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం బట్టి ప్రజలకు మరిన్ని అనుమానాలు పెరిగాయి.
మొన్న రామతీర్థంలో అత్యంత పురాతనమైన శ్రీరాముడి ఆలయంలో మూలవిరాట్టు శిరస్సును దుండుగులు వేరు చేసి కొలనులో పడేశారు. దీనిపై ఏపీ సీఎం అదే జిల్లాలో ఉన్నా ఒక్క కామెంట్ చేయలేదు. దేవాదాయ శాఖ మంత్రి స్పందించలేదు. వైసీపీ తరఫున ప్రభుత్వం తరఫున మూడు రోజులు ఎవరూ అటువైపు చూడలేదు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్లారు. ఆ వెంటనే వైసీపీ నేతల్లో భయం మొదలైంది. ఒక్క గంట ముందు సాయిరెడ్డి అక్కడికి రాగా ఆయనపై చెప్పులు విసిరారు. తర్వాత చంద్రబాబు అక్కడికి చేరుకోగానే ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఉత్తరాంధ్ర ప్రజలు అయోధ్యగా కొలిచే రామతీర్థంలో జరిగిన ఘటన ప్రజలందరినీ తీవ్రంగా కలచివేసింది. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వ పేలవ స్పందన వారిని మరింత బాధపెట్టింది. నిందితులు పోలీసులను పట్టుకోవడంలో విఫలం కావడం జనానికి అసలు నచ్చలేదు.
ఈ తరుణంలో పోలీసుల అలసత్వంతో మరింత ధైర్యం తెచ్చుకున్న హిందు వ్యతిరేక శక్తులు ఇక పోలీసులు 120 దాడుల అనంతరం కూడా మమ్మల్ని పట్టుకోవడం లేదంటే వారు ఇక మమ్మల్ని ఏం చేయరు అన్న భరోసాతో మరిన్ని దాడులకు ప్లాన్ చేశారు. మరి వారికి ఎవరు అండగా ఉంటున్నారో అర్థం కావడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చేంత వరకు గుడుల జోలికి ఎవరూ రాలేదు. కానీ జగన్ అధికారంలోకి రాగానే గుళ్లపై దాడులు మొదలయ్యాయి. ఎవరు చేశారో ఎందుకు చేశారో పట్టుకుని జనానికి చెప్పకపోతే ప్రభుత్వం మీద కూడా జనానికి అనుమానాలొస్తున్నాయి.
ఒకవైపు రామతీర్థం రణరంగంగా మారినా కూడా మళ్లీ వెంటనే రాజమండ్రి సుబ్రమణ్యస్వామి విగ్రహం ధ్వంసం చేశారు. తర్వాత నిన్న అర్ధరాత్రి విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహం ధ్వంసం చేశారు. ఇంకో వైపు ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవవస్థానంలో మరో వివాదం చోటుచేసుకుంది. బైబిల్ కొందరు గుడిలోకి తెచ్చారు. వారికి ఎవరి అండ ఉందో తెలుసుకునే ప్రయత్నం పోలీసులు, అధికారులు చేయలేదు.
వారిని ఎందుకు వదిలిపెట్టారు?
ఉచిత క్యూలైన్లలో కొందరు బైబిల్‌తో వెళ్తున్నారు. ఆ వ్యక్తులను భక్తులు గుర్తించారు. వారి బ్యాగ్‌లలో బైబిల్ ఉన్నట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. హిందువుల పవిత్ర ఆలయంలోకి అన్యమతస్తుల గ్రంథాలను ఎలా అనుమతిస్తారని నిలదీశారు. సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు వచ్చిన వారి బ్యాగ్‌ను పరిశీలించగా వారి వద్ద బైబిల్ కనిపించింది. బైబిల్ గ్రంథాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని ఆ అన్యమతస్తులను వదిలిపెట్టారు. వారిని అరెస్టు చేయకుండా వదిలేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితులకు ఎంత ధైర్యం ఉంటే బైబిల్ తో గుడిలోకి వస్తారు? అని అనుమానం వ్యక్తంచేశారు.
ఇప్పటికే శ్రీశైలంలో అనేక వివాదాలున్నాయి. అక్కడ చర్చిలు ఉన్నాయని ఆరోపణలున్నాయి. మరోవైపు ఆలయం పరిసరాల్లో ఏర్పాటుచేసిన అనేక దుకాణాల్లో ముస్లింలకు ఎక్కువ షాపులు కేటాయించారన్న వివాదాం కూడా ఉంది. తాజాగా ఈ రోజు బైబిల్ తో ఆలయ ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల శ్రీశైలం విషయంలో కర్నూలు ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య వివాదం రాజుకుంది. శ్రీశైలం ఆలయంలో ముస్లింల పెత్తనం పెరిగిపోయిందని రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శ్రీశైలం దేవస్థాన పరిధిలోని షాపులను ముస్లింలకు కేటాయించడం వెనుక వైసీపీ నేత రజాక్ ఉన్నాడని, ఆయన ఆగడాలు పెరిగిపోయాయని విమర్శలు చేశారు. ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి అండతోనే రజాక్ చెలరేగిపోతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శ్రీశైలం గోశాలను కూడా రజాక్ భార్య నిర్వహిస్తోందని.. వందల ఆవులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..