కోలీవుడ్ సీనియర్ హీరో శ్రీరామ్ , కొత్త అమ్మాయి సంచిత జంటగా తెరకెక్కిన సినిమా అసలేం జరిగింది. సినిమాటోగ్రాఫర్‌గా సక్సెస్ ఫుల్ టెక్నీషియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాఘవ (ఎన్వీఆర్) ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయం అయ్యారు. గత ఆరేళ్ల నుంచి ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ‘ఎక్సోడస్ మీడియా’ తొలిసారిగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాను నిర్మించింది. సినిమా రంగంపై ఉన్న ఫ్యాషన్‌తో మేకర్స్ సినిమా కథానుగుణంగా ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు.
1970 – 80 వ దశకంలో తెలంగాణ పల్లెల్లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో తెలంగాణ గ్రామీణంలో ఓ గ్రామంలో అమావాస్య రోజు జరిగే సంఘటనలు, గ్రామంలో కారణం లేకుండా జరిగే వరుస హత్యలు, హీరో, హీరోయిన్ల రొమాంటిక్ లవ్ ట్రాక్, హీరోయిన్‌పై కన్నేసిన మాంత్రికుడు లాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. చివరకు హీరో ఈ కథలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొని విజయం సాధించాడు ? అన్న పాయింట్‌ను ప్రతిక్షణం ఎంతో ఉత్కంఠతో తెరకెక్కించారు.
హీరో శ్రీరామ్, హీరోయిన్ సంచిత మధ్య వచ్చే అన్ని సన్నివేశాలు సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచాయి. రొమాన్స్ సీన్లతో పాటు హర్రర్ సీన్లలో వీరిద్దరు లీనమైపోయారు. ముఖ్యంగా రొమాంటిక్ సీన్లు యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. టెక్నికల్‌గా హర్రర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో సాంకేతిక నిపుణులు అందరూ బాగా కష్టపడ్డారు. అలాగే థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా బాగున్నాయి.
సాంకేతికంగా మ్యాజిక్కు తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమా స్థాయిని మించి ఉన్నాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్ పనితీరు అద్భుతంగా ఉంది. మేకర్స్ ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీతో సినిమాను నిర్మించారు. టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత హర్రర్ థ్రిల్లర్ సినిమాగా అసలేం జరిగింది నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.