మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినిమాల వరకు చూసుకుంటే.. మాంచి ఫేమ్ ఉన్న హీరో.. హీరోయిన్లు తమ మనసులోని విషయాల్ని చాలా తక్కువ సందర్భాల్లోనే బయట పెడుతుంటారు. ముఖ్యంగా తమ క్రష్ గురించి చెప్పేందుకు అస్సలు ఇష్టపడరు. కొందరు మాత్రం ఆ విషయాన్ని చెప్పేందుకు వెనుకాడరు. అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని ఓపెన్ గా చెప్పేయటం తెలిసిందే.
అలానే లైగర్ బ్యూటీగా పాపులర్ అయిన అనన్య పాండే తనకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అంటే క్రష్ అన్న విషయాన్ని ఇటీవల ఒక షోలో చెప్పేసింది. అనన్య లాంటి బ్యూటీ నోటి నుంచి ఫలానా వారు తన క్రష్ అన్న వేళ.. అతడే ఆమెకు ఎదురు పడినప్పుడు అందరి అటెన్షన్ వీరిద్దరిపైనే ఉంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకున్నా.. ఆర్యన్ ఖాన్ అనన్యను అస్సలు చూడకుండా వెళ్లిపోయిన వైనం. .ఈ బ్యూటీకి దారుణమైన అవమానాన్ని మిగిల్చిందన్న మాట వినిపిస్తోంది.
అనన్య తాజాగా నటించిన మూవీ ‘మజా మా’. దీని స్క్రీనింగ్ ను తాజాగా ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్ కు వచ్చిన షారుక్ కొడుకు ఆర్యన్.. ఆమె ముందు నుంచే లోపలకు వెళ్లాడు కానీ.. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా వెళ్లిపోయాడు.దీంతో.. అనన్యకు దారుణమైన అవమానం జరిగిందన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. అనన్యను సపోర్టు చేస్తూ.. ఆర్యన్ యాటిట్యూడ్ ను తప్పు పట్టే వాళ్లు కొందరైతే.. మరికొందరు అతడేం సమస్యలో ఉన్నాడో? అతను కోరుకున్నది ఆమెను కాదేమో? లాంటి వ్యాఖ్యలతో ఆర్యన్ కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా.. తాను నటించిన మూవీ స్క్రీనింగ్ కు వచ్చిన ప్రముఖుడు ఒకరు.. తనను కనీసం చూడకుండా వెళ్లిన వైనం మాత్రం ఆమెను దారుణంగా హర్ట్ చేస్తుందన్న మాట మాత్రం వినిపిస్తోంది.