“సీఎం జగన్ ఆయన పరివారం.. నా రెడ్ బుక్పై కేసులు పెట్టారు. ఒక్కటే చెబుతున్నా.. కేసులు పెట్టడం కాదు.. దమ్ముంటే రా జగన్..! ఇక్కడే ప్రజల మధ్యే ఉన్నాను. నన్ను అరెస్టు చేసుకో“ అంటూ. టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత, సీఎం జగన్ కు సవాల్ విసిరారు. శంఖా రావం పేరిట నిర్వహిస్తున్న సభలు.. గురువారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ చాలా వరకు డిఫరెంట్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
మంత్రులకు పేర్లు..
“మన రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రి ఉన్నాడు. ఆయన పేరు ఎవరికీ తెలియదు. కానీ, అప్పులు అప్పారావు ఎవరు అంటే.. అందరి వేళ్లూ ఆయనవైపే చూపిస్తాయి. ఇక, ఎక్కడ కొండ కనిపించినా.. మింగేసే మంత్రి ఇంకొకరున్నాడు. ఆయనే పాపాల పెడ్డి రెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన మైనింగ్ రెడ్డి. ఎక్కడా దేన్నీ బతక నివ్వడు. ఇసుక, మట్టి, రాళ్లు, కొండలు ఇలా ఏది కనిపించినా.. దాన్ని మింగేస్తాడు. ఇక, మరో మంత్రి ఉన్నాడు.. ఆయన ఎర్రిపప్ప మంత్రి. గొనె సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప గాడు సివిల్ సప్లై మంత్రి’’ అంటూ నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘మా నమ్మకం నువ్వే’’ అంటూ రోడ్ల పై `420` ఫొటోలు పెడుతున్నారని, సొంత తల్లి, చెల్లె జగన్ను నమ్మడం లేదని.. మరి జనం ఎలా జగన్ను నమ్ముతారని నారా లోకేష్ ప్రశ్నించాడు. సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్నారెడ్డికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, దొంగ ఓట్లు నమోదు చేసే అధికారులు జైలుకు వెళ్తారని ఆనాడే చెప్పామని హెచ్చరించారు.