రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి మధ్యంతర బెయిల్ దక్కింది. ఆయనను విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఆత్మహత్య కేసులో ప్రతి ఒక్కరికి రూ .50 వేల బాండ్‌పై విడుదల చేసింది. గోస్వామికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న దరఖాస్తును తిరస్కరించడంపై హైకోర్టును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాలు వ్యక్తిగత స్వేచ్ఛను తిరస్కరించే విషయాలలో మరింత జాగరూకతతో పనిచేయడం లేదని జస్టిస్ డి వై చంద్రచూడ్ అన్నారు. ఆయన ఛానల్ చూడొద్దని అనిపిస్తే చూడకూడదు. నేను కూడా ఆయన ఛానల్ చూడను. అంత మాత్రాన ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను కాదనలేం. అది భిన్నమైనదని, రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని మహారాష్ట్ర ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
మహారాష్ట్ర సర్కారు తీరు బాలేదు. ఇలా చేస్తే సుప్రీంకోర్టు ఉందనే విషయం గుర్తుచేయడానికి ఈ తీర్పు ఇస్తున్నాం. వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు చాలా కీలకం అన్నారు. అయితే, సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు ఏపీ సర్కారుకు కూడా సూటిగా గుచ్చుకున్నాయి. ఇటీవల ఏపీ సర్కారు తీరు కూడా ఇలాగే కొనసాగింది.