కొత్త పీఆర్సీ రద్దు చేయాలంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేపట్టిన‘‘చలో విజయవాడ’’ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఉద్యోగుల నిరసన,భారీసభకు లక్షలాది మంది తరలిరావడంతో బెజవాడ జనసంద్రాన్ని తలపించింది. ఉద్యోగులు స్వచ్చందంగా తరలి రావడంతో ఏపీ చరిత్రలో నిలిచిపోయేలా ఈ ఉద్యమం సక్సెస్ అయిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే బహిరంగసభలో మాట్లాడిన ఉద్యోగులు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
అన్ని విషయాలపై తమతో సజ్జల మాట్లాడుతున్నారని, ఆయన ఏ హోదాలో తమతో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. అసలు సజ్జల ఎవడండీ…అంటూ చాలామంది ఉద్యోగులు విరుచుకుపడ్డాయి. అయితే, జగన్ పై అరాకొరా విమర్శలు చేసినప్పటికీ…జగన్ పై డైరెక్ట్ గా విమర్శలు గుప్పించేందుకు మాత్రం ఉద్యోగులు భయపడినట్లే కనిపిస్తోందన్న టాక్ వస్తోంది.
జగన్ ది కక్షాపూరిత ధోరణి అని, అందుకే టార్గెట్ చేసి మరీ ప్రతిపక్ష నేతలను ఇరుకునపెడుతుంటారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది ఉద్యోగులు…జగన్ ను పల్లెత్తు మాట అనేందుకు కూడా జంకారట. అందుకే, ప్రభుత్వంపై విమర్శించడం..జగన్ హామీఇచ్చి మరిచారని అనడం…సజ్జలను ప్రధానంగా టార్గెట్ చేయడం వరకే పరిమితమయ్యారట. ఉద్యోగులు తమ నిరసన తెలిపినప్పటికీ…సజ్జల సైలెంట్ అవుతారా..జగన్ ఓపెన్ అవుతారా అన్నది తేలాల్సి ఉంది.