ఊర్లో పొలాలు కౌలుకు తీసుకున్న వాళ్ళు…..
నారు పోసుకుందామని అంటే…..
నీళ్లు రాలేదని…..చాలావరకు యద పెట్టుకున్నారు….
ఈసారి కూలి రేట్లు అన్నీ బాగా పెంచేసారు……పొద్దున 3 గంటలు……సాయంత్రం 2 గంటలు…. 5 గంటల పనికి 600/-
ట్రాక్టర్ దుక్కి బాగా పెంచేసారు…..డీజిల్ రేట్ పెరిగిందని
ఈ సారి చాలా మంది రైతు భరోసా లో విత్తనాలు తీసుకోలేదు……అందరూ బయట కొత్త రకం విత్తనం తీసుకున్నారు…..ఎక్కువ రోజులు పంట అని…..వానలు ఎడా పెడా బాగా కొట్టింది కదా….యాద పెట్టిన మొత్తం పోయిందంట….
కౌలుకు తీసుకున్న వాళ్లు వదిలేసి వెళ్లిపోయారు……
బ్యాంకులు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదు….రైతులు అంతా గొడవ….ఇంతవరకు ధాన్యం డబ్బులు…..జొన్నలు డబ్బులు రాలేదు…
బ్యాంకు రుణాలు లేవు…..ఎక్కడ తెచ్చి పంట పండించుకోవాలి అని ఒకరికి ఒకరు చొప్పున బాధపడుతున్నారు….
ఒక ఇంట్లో రెండు పింఛన్లు ఉంటే తీసి వేస్తున్నారు…..
పల్లెటూర్లో కూడా ఇంటి స్థలం ఎంత ఉంది…..ఇంటి వైశాల్యం ఎంత ఉందని లెక్కలు వేసి…..కొత్త పన్నులు వేయడానికి రెడీ అవుతున్నారు…..
వీధి లైట్లు పోతే పట్టించుకోవటం లేదు…..ఇక రోడ్ల సంగతి చెప్పేదేముంది……
ఏ గ్రామీణ ఓటర్ అయితే అందలం ఎక్కించాడో…..వాడినే కొడుతున్నాడు….