ఓవైపు డీజిల్ పన్నులు మరోవైపు త్రైమాసిక పన్నులు ఇంకోవైపు రవాణా అధికారుల కేసులు..ఇన్నీ దాటుకుని రావడం తమ వల్ల కాదని లారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. త్వరలోనే దీనిపై ఏదో ఒక పరిష్కారం చూపాలని సీఎం ను వేడుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల కన్నా ఏపీ ఎన్నో విషయాల్లో వెనుకబడి ఉందని, పన్నుల విధింపు తమకు తలకు మించిన భారం అని కన్నీటిపర్యంతం అవుతున్నారు. జీఓ 21తో జరిమానాలు, జీఓ 67తో పన్నులు విపరీతంగా వసూలు చేయడం న్యాయం కాదని, ఈ రెండింటి విషయమై సీఎం జగన్ మరోసారి ఆలోచించాలని విన్నవిస్తూ ఉన్నారు. ఆ వివరం ఈ కథనంలో…
ఏ విధంగా చూసుకున్నా ఇవాళ రాష్ట్రంలో పన్నుల బాదుడు అధికంగానే ఉంది. ముఖ్యంగా డీజిల్ పై పన్నులు తగ్గించాలని వేడుకుంటున్నా కూడా వినడం లేదు అన్నది లారీ యజమానుల గోడు.
తమిళనాడు మాదిరిగా పన్నులు విధిస్తే తాము ఈ కష్ట కాలం నుంచి ఒడ్డెక్కుతామన్నది వారి అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయం వినాలన్నా ఈ సూచనను పరిగణించాలన్నా ముఖ్యమంత్రి తో మాట్లాడాలి. కానీ అది మాత్రం జరగడం లేదు అని లారీ యజమానులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.
తండ్రి రాజశేఖర్ రెడ్డి కన్నా జగన్ తమకు అందిస్తున్న సాయం ఏమీ లేదన్నది వారి ఆరోపణ. సంక్షోభం లో ఉన్నా కూడా ఏపీ, తెలంగాణ కౌంటర్ సిగ్నేచర్ తగువులు తీరడం లేదు.కనీసం మాట్లాడేందుకు కూడా జగన్ అస్సలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇదీ వాళ్ల గోడు.. వాళ్లు అంటే లారీ యజమానుల గోడు. ఆ రోజు పేర్నినాని మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ఉపశమన చర్యలు చేపట్టినప్పటికీ వాటిని ఇప్పుడు కొనసాగిస్తారో లేదో తెలియదు. అందుకే సభాముఖంగా కొత్త మంత్రికి పేర్ని నాని వేడుకున్నారు.
గతంలో లారీ యజమానుల సంఘాలు ఇచ్చిన విన్నపం మేరకు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకుని వెళ్లే లారీల్లో అధిక లోడ్ ఉన్నా, ఎత్తు ఎక్కువగా ఉన్నా కేసులు రాయొద్దని చెప్పామని, దానిని కొనసాగించే విధంగా చూడాలని పేర్ని నాని నిన్నటి వేళ తాజా రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ను వేడుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకూ సంబంధించిన పెర్మిట్ల విషయంలో మాట్లాడేందుకు తాను ప్రయత్నించినా ఆ రోజు తెలంగాణ సీఎస్ సమీర్ శర్మ అనుమతించలేదని వాపోయారు.
రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. కరోనా తరువాత అస్సలు కోలుకోలేని స్థితిలో ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరలు ఓ కారణం కాగా, గ్రీన్ ట్యాక్స్ పేరుతో రెండు వందల రూపాయలు ఉన్న పన్ను ఇరవై వేలు చేశారు. దీంతో తాము బతకలేకపోతున్నామని సంబంధిత లారీ యజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి.
గతంలో వైఎస్సార్ ను కలిసేందుకు తాము పెద్దగా కష్టపడలేదని, 17 సార్లు ఆయన్ను కలిసి తమ సమస్యలు విన్నవించామని, కానీ జగన్ వచ్చాక ఒక్కసారి కూడా కలవలేకపోయామని అంటున్నారు. నిన్నటి వేళ విజయవాడలో ఏపీ లారీ యజమానులు సంఘం, కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం సంయుక్తంగా తాజా రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్-ను, మాజీ మంత్రి పేర్ని నానిని సన్మానించారు.
ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో అనేక సందర్భాల్లో త్రైమాసిక పన్నుల నుంచి ఇతర రాష్ట్రాలు మినహాయింపు ఇచ్చాయి అని, కానీ తమకు ఒక్కటంటే ఒక్కసారి కూడా త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు దక్కలేదని వాపోయారు.
"మంగళవారం కబుర్లు" అని ఊరికే అనరు
మంగళవారం 1⃣: 13 Oct 2020 – ఇక సాఫీగా రోడ్లు
మంగళవారం 2⃣: 07 Sep 2021 – ఇక రోడ్ మాప్ రెడీ
మంగళవారం 3⃣: 16 Nov 2021 – రోడ్ మాప్ రెడీ
మంగళవారం 4⃣: 03 May 2022 – ఇక పరిశుభ్ర రోడ్స్ pic.twitter.com/90QEYG2jXm— Srivalli (@srivalli2000) May 3, 2022
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో AP రోడ్లు అద్వాన్నంగా మారాయని చెప్పడానికి లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి రాసిన లేఖే సాక్ష్యం. రోడ్ల మరమ్మత్తు చేపట్టండి అని వాహనదారులు వేడుకునే దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. రూ. వేల కోట్ల అప్పులు ఏ అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు? pic.twitter.com/7A6qNFJa9F
— Bonda Uma (@IamBondaUma) February 24, 2022