జనం నుంచి వంద రూపాయలు పరోక్షంగా లాక్కుని పది రూపాయలు ప్రతక్ష్యంగా పంచి జనం ఓట్లు ఎలా కొట్టేయాలి అన్న విద్యలో ఈ దేశంలోనే ఆరితేరిన వ్యక్తి వైఎస్ జగన్.
జనానికి నొప్పి తెలియకుండా వారి నుంచి రకరకాల పన్నులు పిండిన వ్యక్తి.
చరిత్రలో కరెంటు బిల్లు ఒక్కసారి పెంచినందుకే చండశాసనుడుగా చంద్రబాబుపై ముద్రేసిన కుటుంబం జగన్ ది.
అలాంటి జగన్ ఆరు సార్లు కరెంటు ఛార్జీలు, మూడు సార్లు బస్సు ఛార్జీలు పెంచినా కూడా తనకు మట్టి అంటకుండా వాటిలో పది పైసల భాగం జనానికి పంచి అబ్బో గొప్ప సీఎం అనిపించుకే వినూత్న వలను జనం విసరడంలో అందె వేసిన చేయి జగన్ ది.
చివరకు చెత్త పన్ను వేసి దానిని విజయవంతంగా వసూలు చేస్తున్నాడు అంటే జగన్ టాలెంట్ అందరికీ అర్థమవుతుంది.
తాజాగా జనం నుంచి ఎలా పన్నులు పిండాలి అని బహిరంగంగా అధికారులకు ఆదేశాలిచ్చి దానిని బాగా సంపాదించాం అని గర్వంగా చెప్పుకునే స్థాయికి జగన్ ధైర్యం చేస్తున్నారంటే ఇది ఆలోచించాల్సిన విషయమే.
పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. రిజిస్ట్రేషన్ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు చేసిన సీఎం. నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులకు సీఎం ఆదేశం. pic.twitter.com/bbF19XK0FE
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 6, 2022