పొరపాట్లు జరిగినపుడు రాజకీయ నేతలు ఆందోళన చేయడం, ధర్నాలు, నిరసనలు చేయడం మామూలే. మరీ ఏపీ డీజీపీ చెప్పినట్లు చెప్పులు రాళ్లేయడం రాజ్యంగ హక్కు కాదు గానీ.. నిరసన తెలపడం ఒక రాజ్యాంగ హక్కు. శాంతియుతంగా నిరసన తెలిపే వారిని అడ్డుకునే అధికారం ఏ పోలీసుకు లేదు.
అలాంటి వైసీపీ ప్రభుత్వంలో మార్కులు కొట్టేయాలంటే టీడీపీ వారిని నీచంగా చూస్తే చాలన్న అభిప్రాయంతో ఉన్నారేమో పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా… ఒక సీనియర్ టీడీపీ నేతను గొంతు పిసికి పట్టుకుని తోసుకుంటూ వెళ్లి అరెస్టు చేసే ధైర్యం ఒక పోలీసు అధికారి చేశాడంటే… అది అసాధారణ చర్య.
ఈరోజు అధికారంలో ఒకరుండొచ్చు, రేపు అధికారం మారొచ్చు. కానీ ఇలాంటి చర్యలు ప్రజలను భయబ్రాంతులను చేస్తాయి. ఎవరైనా సామాన్యులు అన్యాయానికి గురైతే వారు ప్రభుత్వానికి మాట్లాడకుండా ఉండేలా ప్రోత్సహిస్తాయి. ఇలాగే పోలీసులు మరింత కాలం ప్రవర్తిస్తే… ప్రజల్లో ఒకరకమైన అశాంతి మొదలవుతుంది. పరిస్థితి అక్కడిదాకా వెళ్లకముందే దీనికి అడ్డుకట్ట వేయడం మంచిది.
దీనిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏమన్నారో చూడండి.