ముఖ్యమంత్రి జగన్ కల చెదిరింది. రేపు ఉదయం 10 గంటలకు ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
శనివారం ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ మీడియా సమావేశం పెట్టి నోటిఫికేషన్ వివరాలు వెల్లడిస్తారు. కరోనా కారణంగా ఏపీ పంచాయతీ ఎన్నికలు ఎన్నో మలుపులు తిరిగాయి. అదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్ సంకుచిత కుల రాజకీయ మనస్తత్వాన్ని బయటపెట్టాయి.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి…. ప్రజారోగ్యం దృష్ట్యా నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయాన్ని కమ్మ ముద్ర వేసిన జగన్ రెడ్డి… తప్పుపట్టారు. అయితే… జగన్ ఎన్నిసార్లు కోర్టుకు పోయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది కరెక్టే అని కోర్టులు చెబుతున్నాయి. ఎక్కడా జగన్ ఆటలు సాగలేదు. ఎస్ఈసీదే పైచేయి అయ్యింది.
దీంతో మొన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే కోర్టుకు వెళ్లారు. ఈసారి కూడా నిమ్మగడ్డ రమేషే గెలిచారు. దీంతో రేపు ఎన్నికల నోటిఫికేషన్ మళ్లీ విడుదల కానుంది.