ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జరిగిన పరిణా మాలకు.. మరికొన్ని జోడించి ఆయన నిప్పులు చెరిగారు. ఏపీలో ఉన్నది దొంగల బ్యాచ్ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. దొంగలు, అవినీతి పరులు, పోలీసులను బెదిరించిన వారికి మంత్రి పదవులు దక్కాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా నెల్లూరు కోర్టులో చోరీకి గురైన మాజీ మంత్రి సోమరెడ్డి వర్సెస్ ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డికి సంబంధించి ఫైళ్ల వ్యవహారాన్ని హైకోర్టు.. సీబీఐ విచారణకు అప్పగించింది. అప్పట్లోఈ కేసు విషయం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. నిందితుడిగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు.
కోర్టులో ఫైళ్ల విషయంలో చేసినట్లు ప్రభుత్వంలో ప్రజాధనాన్ని కూడా చోరీ చేయగలడనే ఉద్దేశంతోనే కాకాణికి మంత్రి పదవి ఇచ్చారని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో దోపిడిదారులు, దొంగలు కలిసి ఒక బ్యాచ్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. కోర్టులో ఫైళ్లను చోరీ చేసే ఘనులకు మంత్రి పదవి ఎలా ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఈ ఫైళ్లచోరీ కేసులో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌కు సిగ్గుంటే మంత్రి కాకాణితో రాజీనామా చేయించాలని, చేయకుంటే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. మరొకరైతే వెంటనే డిస్మిస్ చేసేవారని అన్నారు. అయితే,జగన్ మీదే సీబీఐ కేసులున్నాయి కాబట్టే డిస్మిస్ చేయలేదని విమర్శించారు. మొత్తం దొంగలు, దోపిడీదారుల బ్యాచ్ అని అన్నారు. వితండవాదం, విధ్వంసం ఆపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం….
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు….
— Team Lokesh (@Srinu_LokeshIst) November 24, 2022