చిన్నారి పిల్లలు స్కూలుకు పోయి గంటలు గంటలు అక్కడే కూర్చుంటే వారికి కరోనాతో ఇబ్బంది లేదట.
కానీ ఎన్నికలు నిర్వహించడానికి ఒక రోజు సిబ్బంది వస్తే వారికి కరోనా వస్తుందట.
వైసీపీ పెట్టే మీటింగ్ కి వేలమందిని పోగేస్తే వారికి కరోనా రాదట
ఒక గంట ఓటర్లు దూరం దూరంగా పోలింగ్ స్టేషను వద్ద నిలబడి ఓటేస్తే వారికి కరోనా వస్తుందట.
వైన్ షాపులు ఓపెన్ చేస్తే అక్కడ క్యూలతో జనాలకు కరోనా రాదట
కానీ ఎన్నికలు పెడితే కరోనా పరుగెత్తుకుంటూ వస్తుందట.
ఏం న్యాయం ఇది
అపుడు ఎన్నికలు వద్దంటే… కరోనానా కమ్మోనానా అన్నారు.
తర్వాత సహజీవనం అన్నారు.
కానీ ఓటింగ్ కి మాత్రమే కరోనా అడ్డమొస్తుందంటున్నారు.
చిన్నపిల్లల భవిష్యత్తు కంటే ఓటరు క్షేమమే వైసీపీ సర్కారు ప్రధానమా?
కరోనా వచ్చి పిల్లలు పోయినా పర్లేదు స్కూళ్లు తెరుస్తారు కానీ వైసీపీకి ఓటేసే ఓటరును మాత్రమే కరోనా రాకుండా ఇళ్లలో ఉంచుతారా?
ఎన్ని అబద్ధాలు, ఎన్ని వింతలు… కరోనాను జగన్ తొక్కేశాడు అని చెప్పిన మంత్రే పోలింగ్ సిబ్బంది ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు.
ఇక జగన్ తీసుకున్న యుటర్న్ అయితే మానోటితో మేం చెప్పలేం
ఈ వీడియోలో మీరే చూడాలి
U Turn Video of Jagan Reddy