టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను ఇరకాటంలో పెట్టేందుకు, ఏపీలో సంగం డెయిరీని నిర్వీర్యం చేసి అమూల్ సంస్థను అక్కున చేర్చుకునేందుకు ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, అమూల్ ను అందలం ఎక్కించేందుకు జగన్ సర్కార్ తహతహలాడుతూ అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విమర్శలు వచ్చాయి.
ఏపీలో పాల సేకరణకు అమూల్ సన్నాహాలు చేస్తూ ప్రైవేటు డైరీలను, సహకార డెయిరీలను నిర్వీర్యం చేసే ప్రక్రియ మొదలుబెట్టిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ తో అమూల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పిటిషన్ ను విచారణ జరిపిన హైకోర్టు….జగన్ కు షాకిచ్చింది.
అమూల్‌తో కుదుర్చుకున్న ఎంవోయూపై ఎలాంటి నిధులు వెచ్చించొద్దని జగన్ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు.. గుజరాత్‌లోని అమూల్‌కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14వ తేదీకి కేసు తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
అంతకుముందు ఏపీడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం జగన్ అధ్యక్షత కేబినెట్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై రఘురామ హైకోర్టు తలుపు తట్టారు. ఈ నిర్ణయాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించి, రద్దు చేయాలని కోరుతూ రఘురామ పిల్ దాఖలు చేశారు.
ఇప్పటికే జగన్ సర్కార్ కు పలు షాక్ లు ఇస్తోన్న ఆర్ఆర్ఆర్…తాజాగా మరో దిమ్మదిరిగే షాకిచ్చారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అమూల్ బేబీ జగన్ కు ఆర్ఆర్ఆర్, హైకోర్టు షాకిచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
జగన్ కు కోర్టులో ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ, నిబంధనలను తుంగలో తొక్కి పాలన చేస్తున్నారని, అందుకే న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏపీ–అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును జగన్ ప్రారంభించిన రోజే హైకోర్టు షాకివ్వడంతో వైసీపీ నేతల మైండ్ బ్లాకయిందని అంటున్నారు.
రఘురామ ఆట మొదలైందని, ముందు ముందు జగన్ కు మరిన్ని షాకులు తప్పవని అంటున్నారు. మరి, ఈ వ్యవహారంపై జగన్ సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
19-Oct-2020
డెయిరీపై దొంగదెబ్బ!
మన పాలు అమూల్‌కు ధారాదత్తం
‘ఆనంద్’కు అమ్మడానికి సన్నాహాలు
సహకార, ప్రైవేటు డెయిరీలపై పడగ
పాడిరైతులకు ఇస్తామన్న బోనస్ తుస్
హెరిటేజ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా
లీటరు పాలకు రూ.55
ఆర్బీకేల్లో కొత్తగా పాల సేకరణ కేంద్రాలుhttps://t.co/QZkZbRODm1 pic.twitter.com/xE8GTakZ3b— Eclector (@eclector1419857) April 24, 2021