ఖజానా నింపుకునేందుకు కొన్ని నెలలుగా ప్రజలపై సీఎం జగన్ సైలెంట్ గా పన్నుబాదుడు విధిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ఏపీకి పెట్టుబడులు రాకపోవడంతో….ప్రత్యామ్నాయంగా ప్రజలపై ‘పన్ను’పోటు పొడుస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీల పెంపు….ఇలా సైలెంట్ గా జగన్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేశారని విమర్శలు వస్తున్నాయి.
త్వరలో రవాణా శాఖలో పన్నులు పెంచి దాదాపుగా రూ.500 కోట్లు పన్నులు రాబట్టాలన్న యోచనలో జగన్ ఉన్నారట. ఇక, జగన్ అనే నేను అంటూ కొద్ది రోజుల క్రితం ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించడం విమర్శలకు తావిచ్చింది. ఇలా ప్రజల నుంచి పన్నుల ద్వారా పిండిన డబ్బు చాలకపోవడంతో తాజాగా ఏపీలో ప్రజలపై మరో రెండు రకాల పన్ను పోటు విధించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది.
ఇకపై ఏపీలో డబుల్ లైన్ రోడ్లన్నింటికీ టోల్ వసూలు చేయబోతున్నారు. ఇకపై ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేయాలని జగన్ సర్కార్ నభూతో నభవిష్యత్ అన్న తరహాలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం జాతీయ రహదారులకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ, ఇకపై ఏపీలో రాష్ట్ర రహదారులకు, డబుల్ లైన్ ఉన్న ప్రతీ రోడ్డుకి టోల్ పెట్టి ప్రజల తోలు తీయనున్నారు. ప్రతి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకూ ఓ టోల్ గేట్ పెట్టబోతున్నారు. ఆల్రెడీ లైఫ్ ట్యాక్స్ కట్టిన ప్రజలు ఇకపై జగన్ టోల్ టాక్స్లు కట్టక తప్పదు. అయితే, ఏపీ చరిత్రలో నెవర్ బిఫోర్…ఎవర్ ఆఫ్టర్ వంటి ఈ టోల్ ట్యాక్స్… ద్విచక్ర వాహనలకూ కూడా పెడతారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, ఆస్తి పన్ను విషయంలో అయితే, కొత్త నిబంధన దారుణంగా ఉంది. ఉదాహరణకు 30 ఏళ్ల కిందట రూ.3 లక్షలు పెట్టి కొన్న ఇల్లు ప్రస్తుత ధర 3 కోట్లు ఉంటే…ఆ రూ.3 కోట్లకు ట్యాక్స్ కట్టాల్సిందేనట. ఈ రకంగా పన్నుల ద్వారా ప్రజలందరి నడ్డి విరుస్తున్న జగన్….మరోవైపు కొందరికి సంక్షేమ పథకాలు అందిస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో మరెన్ని జగన్ చేసే వింత పనులు…విధించే వింత పన్నులు తుగ్లక్…పులకేసిలను గుర్తుచేయడం ఖాయమని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.