కోవిడ్ వచ్చిన తొలినాళ్ల నుంచి జగన్ వ్యవహారం వివాదాస్పదంగా ఉంది. చంద్రబాబు మీద పగతో రాష్ట్రాన్ని కోవిడ్ కి బలి చేశారు జగన్ రెడ్డి.
కోవిడ్ గత ఆగస్టులో కాస్త నెమ్మదించిన వెంటనే… దానిని పట్టించుకోవడం మానేశారు ఏపీ ముఖ్యమంత్రి. దేశ ప్రధానే పట్టించుకోనపుడు, నాదేముందిలే అనుకున్నాడు. ఇద్దరు పట్టాల్లేనీ పీజీ విద్యార్థులే కాబట్టి ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు.
అమెరికా వ్యాక్సిన్ పై ఎటువంటి ముందడుగు పడకముందే వస్తుందో రాదో తెలియని వ్యాక్సిన్ కోసం అడ్వాన్స్ కట్టి 30 కోట్ల వ్యాక్సిన్లు ఆర్డర్ పెట్టింది. తర్వాత అనేక యూరప్ దేశాలు ఇలానే చేశాయి. మన దేశం కంటే ఎక్కువగా కోవిడ్ కంట్రోల్ చేసిన దేశాలే ముందుచూపుతో వ్యాక్సిన్లకు ఆర్డర్లిచ్చాయి.
దేశంలో పాలకులు పట్టించుకోలేదు. జగన్ దాన్నసలు లెక్క చేయలేదు. వ్యాక్సిన్ కంపెనీలతో మాట్లాడలేదు. పైగా కరోనాకు కూడా కులం అంటగట్టి తన పార్టీ నేతలతో తిట్టించాడు.
ప్రపంచంలో ఏ అడ్మినిస్ట్రేటరు ఇలా చేయడు. నిమ్మగడ్డపై పగ తీర్చుకోవడం కోసం కరోనాను తక్కువ చేసి చూపించారు. నిజానికి మార్చికి ముందు మన దేశంలో కావల్సినన్ని వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందుచూపుతో అపుడే ఆర్డరు పెట్టి ఉంటే ఈ పాటికి అందరికీ వేసుండేవారు.
రాజకీయం, ఓటు పథకాలు తప్ప మరోదానిపై ముఖ్యమంత్రి ఆసక్తిచూపలేదు. దాని ఫలితంగా ప్రజలు సర్వం కోల్పోతున్నారు. విజన్ లెస్ సీఎంగా మిగిలిపోయారు. ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి.
ఇపుడు చివరకు 2022 వరకు నేను యువతకు వ్యాక్సిన్ వేయించలేను, నా దగ్గర లేవు అంటున్నారు. ఇప్పటివరకు ప్లానే లేనపుడు వ్యాక్సిన్ ఎలా ఉంటుంది? జగన్ తాను చేసిన తప్పునకు ఇపుడు మీటింగ్ పెట్టి మీ జాగ్రత్తలో మీరుండండి మరో ఏడాది మీకు వ్యాక్సిన్ ఇవ్వలేను అని చేతులెత్తేసి తప్పుకున్నారు.
ఇలాంటి ముఖ్యమంత్రి పాలనలో ఏపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మరి.