• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఉద్యోగుల జీతాలకు దసరా ముసురు

admin by admin
October 4, 2022
in Andhra, Politics, Trending
0
The public debt of Andhra Pradesh

huge debts in ap

0
SHARES
117
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

దసరా.. తెలుగువారంతా ఎంతో వైభవంగా జరుపుకునే అతి పెద్ద పండుగలో ఇది ఒకటి. అందుకే, దసరానాడు ఏదైనా కొత్త వస్తువు కొనాలని, వైభవంగా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగను జరుపుకోవాలని అందరూ భావిస్తుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంగతి చెప్పేదేమీ లేదు. అందులో ఈసారి దసరా ఐదో తారీకున రావడంతో ఒకటో తారీకు జీతాలు వస్తాయి కాబట్టి ఈసారి దసరా పండుగనాడు నిజంగానే పండగ చేసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు భావించారు.

అయితే, ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉంది. నాలుగో తారీకునాటికి కూడా ప్రభుత్వ ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు జమ కాకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం పడినట్టుగా మెసేజ్ ఎప్పుడు వస్తుందోనని సెల్ ఫోన్ వైపు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. పండగకు ఒక్కరోజే మిగిలి ఉండటంతో, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పండుగ మూడ్ లోకి వెళ్ళలేకపోతున్నారు.

ఈ సమస్య ఒకరితో ఇద్దరిదో కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు…అందరిదీ. సోమవారం అర్ధరాత్రి నాటికి ఈ 14 లక్షల మందిలో కేవలం పాతిక శాతం మందికి మాత్రమే జీతాలు పడ్డాయి. మిగతా 75% జీతాలు ఒక్కరోజులో పడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రతినెల 3700 కోట్లు చెల్లించాల్సిన ప్రభుత్వం…ఖజానా నిండుకోవడంతో వెయ్యి కోట్లు మాత్రమే చెల్లించిందని తెలుస్తోంది.

5వ తారీకు ఇంటి అద్దెలు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల నుండి తీసుకున్న ఈఎంఐలకు కట్ ఆఫ్ డేట్ 5వ తారీకు కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండి కూడా అమ్మో ఒకటో తారీకు అనేలా పరిస్థితి తయారైందని అంటున్నారు. ఈరోజు జీతాలు పడకపోతే పండగ రోజు కూడా పచ్చడి మెతుకులు తప్పవని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags: ap employeesdasaraJagannot happysalaries pending
Previous Post

సీఐడీ పోలీసులకు వర్ల రామయ్య షాక్

Next Post

ఉచితాలతో ఆర్థిక టైం బాంబుగా ఏపీ

Related Posts

Trending

రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు

June 8, 2023
Trending

ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు

June 8, 2023
Trending

ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం

June 8, 2023
Trending

మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌

June 8, 2023
Around The World

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

June 8, 2023
Andhra

మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!

June 7, 2023
Load More
Next Post

ఉచితాలతో ఆర్థిక టైం బాంబుగా ఏపీ

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ పై హైకోర్టు సంచలన ఆదేశాలు
  • ఆ ఘనత సీఎం జగన్ ఒక్కడికే దక్కింది..అయ్యన్న సెటైర్లు
  • ఆదిపురుష్ టీంపై దుష్ప్ర‌చారం
  • మ‌డ‌మ తిప్ప‌డం అంటే.. ఇది కాదా జ‌గ‌న్‌.. ఉద్యోగుల ఫైర్‌
  • #ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!
  • శక పురుషునికి ‘బాటా’ శత జయంతి నీరాజనం!
  • మిషన్ రాయలసీమతో సీమ కష్టాలకు శాశ్వత పరిష్కారం – నారా లోకేష్!
  • జగన్ ఇలాకాలో లోకేష్ సీమ గర్జన…వరాల జల్లు
  • జగన్ పాలనలో ఆ ర్యాంకు పాతాళానికి పడిపోయింది:చంద్రబాబు
  • ముందస్తు ఎన్నికలపై జగన్ తాజా కామెంట్స్…అదే వ్యూహమా?
  • వివేకా కేసులో మరో ట్విస్ట్..ఆ టెస్ట్ కు కోర్టు ఓకే!
  • జగన్ కు దేవినేని ఉమ సెల్ఫీ ఛాలెంజ్
  • మహిళలకు వైసీపీ ఎమ్మెల్యే శాపనార్థాలు
  • సాయం చేసి… శవాలు చూసి… వారికి ఏమైందంటే.
  • తిరుపతిలో హీరోయిన్ తో ఓం రౌత్ పాడు పని…వివాదం

Most Read

#ఉండవల్లి కంటే #ఊసరవెల్లే బెటరేమో…!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra