ఏపీ రాజకీయాల్లో మళ్లీ ముందస్తు ముచ్చట్లు ఊపందుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని పలు మార్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా ఈ విషయాన్ని పలు మార్లు బహిరంగంగానే చెప్పారు.
అయితే ఇప్పుడు తాజాగా కమలనాథులు కూడా ముందస్తు ముచ్చట్లు చెప్పడం మొదలెట్టారు. ఆ పార్టీ నేతలు ఏకంగా ఏ నెలల్లో ముందస్తు ఎన్నికలు వచ్చేది కూడా చెప్పేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయని జోస్యం చెప్పేస్తున్నారు.
బీజేపీలో సీనియర్ నేత సత్యకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది ముందుగానే ముందస్తు ఎన్నికలు రాబోతుత్నాయని చెప్పిన రాజకీయ జోస్యం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్- మే మాసాల్లో ఎన్నిలకు వెళ్లడానికి జగన్, వైసీపీ నేతలు సిద్ధపడుతున్నారని ఆయన చెప్పారు. వైసీపీ పూర్తీ కాలం అధికారంలో ఉంటే ప్రజావ్యతిరేకత పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తోందని, అందుకే ఏడాదికి ముందే ముందస్తు ఎన్నిలకు సిద్ధపడుతోందని కలమనాథులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే టీడీపీ నేత చంద్రబాబు కూడా పలుమార్లు చెప్పారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఎప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తాయనేది మాత్రం చెప్పలేదు. ఈ ప్రభుత్వం పూర్తీ కాలం అధికారంలో ఉండదని, ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ఆ ఎన్నికల్లో వైసీపీ పుట్టిమునగడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు ఢంకా భజాయిస్తున్నారు.
మరోవైప అధికార వైసీపీ నుంచీ మాత్రం ముందస్తు ఎన్నికలపైన ఎలాంటి వ్యాఖ్యలు వినిపించకపోయినా ఆ పార్టీలో జరిగే పరిణామాలన్నీ కూడా ముందస్తు ఎన్నికల సూచనలు చేస్తున్నాయి. గడపగడప కార్యకమ్రం నిర్వహించడం, పార్టీ నేతలతో సీఎం జగన్ వరుస భేటీలు నిర్వహించడం, తాజాగా 5 లక్షల మందికిపైగా వైసీపీ గ్రామసారథులను నియమించుకోవాలని నిర్ణయించడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వచ్చే బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందని, అందులో ప్రజల సంక్షమానికి, మరిన్ని ఆకర్షణీయమైన పథకాలు ప్రకటించి తదుపరి అసెంబ్లీని రద్దు చేసి వైసీపీ ముందస్తు ఎన్నికలకు వెళుతుందని ప్రచారం జరుగుతోంది.
ముందస్తు ఎన్నికల భయంతో ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. పార్టీల అధినేతలు, నాయకులు యాత్రలు, పర్యటనలు లాంటి కార్యక్రమాలు చేపడుతూ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నారు.