• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ను బ్యాన్ చేసిన కాంట్రాక్టర్లు?…ప్రూఫ్ ఇదే?

రూ.186 కోట్ల విలువైన రోడ్ల మరమ్మతుల పనులకు ఒక్క టెండర్ రాని వైనం

admin by admin
August 19, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
588
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే…నిర్మాణ రంగంలో ఉన్న చిన్నాచితకా కంపెనీలు మొదలు పేరుమోసిన బడా కార్పొరేట్ కంపెనీల అధినేతల వరకు అందరూ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటారు. రోడ్ల మరమ్మత్తులు, సీసీ రోడ్లు, రహదారి విస్తరణ మొదలు…పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టు పనులు చేజిక్కించుకునేందుకు లాబీయింగ్ చేస్తుంటారు. ఆయా పనుల కోసం టెండర్లు ఎప్పుడు పిలుస్తారా…తమ నెట్వర్క్ ఉపయోగించి తక్కువ ధరకు టెండర్ వేసి ఆ నిర్మాణ కాంట్రాక్టు ఎలా కొట్టేద్దామా అని కాచుకు కూర్చుంటారు.

అయితే, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ పాలనలో సీన్ రివర్స్ అయింది. కోట్ల విలవైన కాంట్రాక్ట్ ఉంది…టెండర్ వేసుకోండి అంటే…కాంట్రాక్టర్లు కిక్కురుమనడం లేదు. మీకింత…మాకింత…అని పోకిరిలో మహేష్ బాబు తరహాలో మంత్రుల పేషీలలోని మధ్యవర్తులు లాబీయింగ్ చేసినా కూడా కాంట్రాక్టర్లు సచివాలయం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదట. తాజాగా, దాదాపు రూ.186 కోట్ల విలువైన రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులకు సంబంధించిన కాంట్రాక్టు కోసం టెండర్ వేసేందుకు ఒక్క కాంట్రాక్టరు కూడా ముందుకు రాకపోవడం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులకు రూ.186 కోట్లతో 96 రోడ్లకు ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్లు పిలిచారు. అయితే, దాదాపు రెండువందల కోట్ల విలువైన కాంట్రాక్టును కొట్టేసేందుకు తహతహలాడాల్సిన కాంట్రాక్టర్లు…కనీసం టెండర్ పేపర్ కూడా పట్టుకోవడానికి ఇష్టపడడం లేదట. అప్పుల కుప్పలా మారిన ఏపీ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న కథనాలు, జగన్ అప్పు చేసి పప్పుకూడుపై కేంద్రం సైతం ఆరా తీయడం, ఇప్పటికే చాలామంది కాంట్రాక్టర్లు గత రెండేళ్లుగా చేసిన పనులకు నయాపైసా బిల్లులు రాకపోవడం వంటి కారణాలతో కాంట్రాక్టర్లు కుదేలైపోయారట.

ఒకవేళ అప్పో సప్పో చేసి టెండర్ వేస్తే…ప్రభుత్వం నుంచి బిల్లులు ఎప్పుడు వస్తాయనే గ్యారెంటీ లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల కోసం కోర్టులకెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ వస్తే నిర్మాణ రంగం ఊపందుకుంటుందని ఓటేసిన తమ బ్రతుకులు దుర్భరమయ్యాయని కాంట్రాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో హాట్ కేక్ లా మారే టెండర్ ప్రక్రియ…ఇపుడు సద్ది కేక్ లా మారిందని కాంట్రాక్టర్లు అంటున్నారు. టెండరు వేయండి మహాప్రభో అని పదే పదే గడువు పొడిగిస్తున్నా కాంట్రాక్టర్లెవరూ టెండర్ వేసేందుకు సాహసించడం లేదు. పనులు పూర్తి కాగానే బిల్లులు ఇప్పిస్తామని  కొంతమంది మంత్రులు  చెప్పినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటే కాంట్రాక్టర్లు ఏ రేంజ్ లో హడలిపోతున్నారో అర్థమవుతోంది.

మరోవైపు, ఏపీ ప్రభుత్వం పిలిచే టెండర్లలో పాల్గొనకూడదని జగన్ ను కాంట్రాక్టర్లు బ్యాన్ చేశారని తెలుస్తోంది. ఇలా తమ నిరసన తెలిపితే అయినా చేసిన పనులకు బిల్లులు వస్తాయేమోనని వారు అనధికారికంగా ఏపీ ప్రభుత్వంపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి, ఈ కాంట్రాక్టర్ల అనుమానాలను జగన్ నివృత్తి చేయకుంటే ఏపీలో గతుకుల రోడ్లకు అతుకులు వేసే వారు కూడా ఉండరని, గుంతల రోడ్లలో ప్రయాణాలు చేసి నడుము నొప్పులతో ఆరోగ్య శ్రీలో ఆస్పత్రిలో చేరితే ఆ బిల్లులు కూడా జగనే చెల్లించాలని, దానికి బదులు రోడ్లు బాగు చేయిస్తే వృతం…ఫలితం రెండూ దక్కుతాయని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

Tags: ap cm jaganbills pending in apcontractors banned jagan?contractors in apRs.186 crores worth contracts
Previous Post

ఇది ఓ రేంజ్ క్లీవేజ్ షో

Next Post

అలా జరగకుంటే చిరంజీవిని లోకేష్ శాసించేవారా?…వైరల్ పిక్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

అలా జరగకుంటే చిరంజీవిని లోకేష్ శాసించేవారా?...వైరల్ పిక్

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra