ఏపీకి ఒకే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం సందిగ్దంలో ఉన్న ఏపీ ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది. ఏ రాష్ట్ర ప్రజలు అయినా తమకు ఒక పెద్ద నగరం కేరాఫ్ అడ్రెస్ గా ఉండాలని కోరుకుంటారు. అయితే, దానిని అద్భుతంగా మలచాలని చంద్రబాబు అనుకున్నారు.
జగన్ రెడ్డి సీఎం కావడంతోనే అటు ప్రజలు ఇటు చంద్రబాబు ఇద్దరి కల చెదిరిపోయింది. ఏపీ రాజధాని అమరావతి కుంగిపోయింది. అమరావతిని నమ్మి పరిసరాల్లో పెట్టుబడులు పెట్టిన లక్షలాది ప్రజలు వేల కోట్ల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరైంది. ఇది హైదరాబాదుకు మరింత బూస్టప్ ఇచ్చింది. అమరావతి డోలయామానంలో పడటంతో హైదరాబాదు అభివృద్ధి శరవేగంగా దూసుకుపోయింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టిడిపి) మరియు దాని అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద నైతిక బలం ఇచ్చినట్లయ్యింది.
ఆర్థిక లోటుతో అల్లాడే ఏపీ కష్టాలు తీరాలంటే ప్రపంచానిని మెప్పించే నగరం ఒకటి మనకు కావాలని… అందుకోసం అమరావతి కట్టాలని చంద్రబాబు నాయుడు తలపోశారు. ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలని కలలు కన్నారు. అందుకోసం ప్రజలను ఒప్పించి సుమారు 33 వేల ఎకరాల భూమితో 29 గ్రామాలలో తొమ్మిది కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిని కట్టడానికి ప్రపంచంలో అందరూ మెచ్చే సింగపూర్ ఆంధ్రాకు తోడై నిలిచింది. అయితే, చంద్రబాబు దిగిపోవడంతో ఆ కల చెదిరిపోయింది.
తన రాజకీయ స్వలాభం కోసం జగన్ రెడ్డి అమరావతిని గొంతు నులిమారు. ఎన్నికల ముందు చంద్రబాబు కంటే గొప్ప రాజధాని కడతాను అని చెప్పింది 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించాక జగన్ రెడ్డి యుటర్న్ తీసుకున్నారు. అమరావతి రైతుల ఆశలపై జగన్ ప్రభుత్వం నీళ్లు చల్లింది, ప్రభుత్వం అమరావతిని శాసనసభ రాజధాని నగరంగా పూర్తిగా డౌన్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
రాజధాని నగర విభజనపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న యోచనలను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. టీడీపీ రైతులకు మద్దతు ఇవ్వడమే కాకుండా, ఎగువ సభలో మెజారిటీ ఉన్నప్పుడే శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించింది. అధికార వైఎస్సార్సీపీ హడావుడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ బిల్లుల ఆమోదాన్ని పార్టీ దాదాపుగా నిలిపివేసింది.
జనవరి, 2020 సెషన్లో మూడు రాజధానుల నగరాల బిల్లు మరియు CRDA చట్టం రద్దు బిల్లును ప్రవేశపెట్టినప్పుడు శాసన మండలిలో ఓటింగ్ విభజన కోసం టీడీపీ డిమాండ్ చేయడం సభలో గందరగోళ దృశ్యాలకు దారితీసింది.
బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ వర్గాల్లో అలజడి రేపింది. చైర్మన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆయన ఛాంబర్లో నిరసనకు దిగింది. విచిత్రమేమిటంటే, రాష్ట్ర ప్రభుత్వం నిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకుండా ప్రక్రియను ఉపసంహరించుకుంది.
సాంకేతిక కారణాలను చూపుతూ, శాసనసభ కార్యదర్శి పదేపదే హెచ్చరించినప్పటికీ, సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేసే ఫైల్‌ను చైర్మన్‌కు పంపలేదు.
మూడు రాజధాని నగరాల బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను కౌన్సిల్ నిలిపివేసిన మరుసటి రోజే ఆగ్రహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనమండలిని రద్దు చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ఎగువ సభను రద్దు చేస్తూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.
కొన్నాళ్లు గడిచాక మళ్లీ జగన్ యుటర్న్ తీసుకున్నాడు. పార్లమెంటు బిల్లులకు ఆమోదం తెలపకముందే, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. వైఎస్ఆర్సిపికి మెజారిటీ వచ్చిన తర్వాత ఎగువ సభను కొనసాగించాలని నిర్ణయించుకుంది. తదనంతరం, రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పద మూడు రాజధాని నగరాల బిల్లు మరియు CRDA చట్టం రద్దు బిల్లును మరోసారి అసెంబ్లీ మరియు కౌన్సిల్లో ఆమోదించింది. చివరకు అది గవర్నర్ ఆమోదం పొందింది.
అయితే, విశాల ప్రజా ప్రయోజనాలతో బిల్లు ముడిపడి ఉడటంతో వివాదం కోర్టుకు ఎక్కింది. న్యాయపరంగా అమరావతి రైతులది పై చేయి అయ్యింది. రాజ్యాంగబద్ధంగా తమకు న్యాయం చేయాలని అమరావతి రైతులు అలుపెరగకుండా పోరాడారు. దీంతో వైసీపీ సర్కారుకు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. వాస్తవం అర్థమై న్యాయపరంగా తన ఆలోచన నిలవదని జగన్ భావించడంతో ఒక సంవత్సరం తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల బిల్లును రద్దు చేసింది.
తాజాగా కోర్టు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాల్సిందే అని ఆదేశించింది. దీనిపై ప్రజల్లో హర్షం వ్యక్తమైంది. పెద్ద ఎత్తున ప్రజలు బాణసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. హైకోర్టు నిర్ణయంపై ప్రతిపక్షాలన్నీ హర్షం వ్యక్తంచేశాయి.
అమరావతి పై న్యాయస్థానం తీర్పు సందర్భంగా చిత్తూర్ లో సంబరాలు. pic.twitter.com/7qm9nKwT1H
— Varun ఉవాచ (@VKsaysso) March 3, 2022
“సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని మేము రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాము. అమరావతిని ఒకే రాజధానిగా ఉంచాలని, ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మా సూచనను పట్టించుకోకుండా అహంకారంతో వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుణపాఠం నేర్చుకుని అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు.