ప్రతిపక్షంలో ఉన్నపుడు లేనివి ఉన్నవీ చెప్పి టీడీపీనీ వైసీపీ చేసిన డ్యామేజ్ చేసినా టీడీపీ సైలెంట్ గా ఉంది.
దాని ఫలితమయే ఘోర పరాజయం. కానీ ఆరోజు వైసీపీ చేసిన ఆరోపణలు, ప్రచారాలే ఇపుడు జగన్ కి బూమ్ రాంగ్ అవుతున్నాయి.
అప్పట్లో చంద్రబాబు ను అసలు ఆంధ్ర రాజధాని ఎక్కడ అని ఏడాది కూడా ఓపిక పట్టకుండా ప్రశ్నించిన వైసీపీ నేతలను చూశాం. కానీ ఉన్న రాజధానిని పీకేసి ఏపీకి దిక్కుమొక్కు లేకుండా చేశాడు సీఎం జగన్ రెడ్డి.
అప్పట్లో చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత చెవిరెడ్డి మాట్లాడిన వీడియో ఇప్పటి సిట్యుయేషన్ కి పూర్తిగా సింక్ అయిపోయింది.
చెవిరెడ్డి చూసినా షాక్ తినేలా ఉందా వీడియో … ముఖ్యమంత్రి గారు రాజధాని ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు.