ఇప్పటి నుంచి పార్టీ కోసం పనిచేయాలి. అప్పటి దాకా పదవుల కోసం నిరీక్షణ చేయాలి. ఆ విధంగా ఉంటే తప్ప జగన్ క్యాబినెట్ లో మరోసారి బెర్త్ కన్ఫం కాదు. ఆవిధంగా ఉన్నా లేకపోయినా కూడా ఉండే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఆ విధంగా ఉండేందుకు ముఖానికి కొత్త రంగేసుకుని తిరగాలి. నెరసిన జుట్టుకు కూడా రంగేసుకుని రంగంలోకి దిగాలి.
ఎందుకంటే ప్రత్యర్థులను సాక్షాత్తూ సీఎం జగనే దెయ్యాలు భూతాలు అని తిడుతున్నారు కనుక వారికి కౌంటర్ ఇవ్వాలంటే మళ్లీ మళ్లీ ఎంత కొంత కొత్త స్టఫ్ వెతుక్కోవాలి. అందుకే మాజీలకు ఇకపై ఇంకొన్ని బాధ్యతలు నెత్తినపడబోతున్నాయి. చాలా మందికి ఇది తెలుసు. జిల్లాల బాధ్యతలు తీసుకుని తరువాత గెలుపు గుర్రాలుగా మారి వచ్చే ఎన్నికల్లో రేసులో అనుకున్న ఫలితాలు సాధిస్తేనే మళ్లీ సింహాసనం దక్కుతుంది అని వాళ్లకూ తెలుసు.
అందుకే ఏడుపులూ పెడబొబ్బలూ.. తానేటి వనిత అనే మంత్రి చెప్పిన విధంగా మాజీ మంత్రి అన్నది ఇకపై శాశ్వత హోదా.. ఏదో శాశ్వతం కాదు అని అంటారు కానీ ఈ విధంగా కొన్ని శాశ్వతాలు మన నాయకుల గూటికి చేరిపోయాయి.
రాజీనామాలు చేసి బయటకు వచ్చాక మంత్రుల నోట మాట లేదు. బొత్స ఉలుక్కీ పలుక్కీ అస్సలు అర్థమే లేదు. బూతుల మంత్రి నాని ఎప్పటిలానే రెచ్చిపోకుండా కాస్త హుందాతనం పాటించారు. ఇదొక్కటే మినహాయింపు.
ఇక వెళ్లిన వారంతా జిల్లాలకు వెళ్లాలి. మే నెల నుంచి మండుటెండల్లో తిరగాలి. జగన్ కూడా అప్పుడప్పుడూ జిల్లాల పర్యటనకు వస్తారు.ఆ సమయంలో ఇంకాస్త శ్రద్ధ వహించి పనిచేయాలి. వీరిని పర్యవేక్షించేందుకు వీరి పనితీరు అంచనావేసేందుకు పీకే టీం గ్రౌండ్ లెవల్ లో వర్క్ చేస్తుంది. కనుక పనిచేస్తేనే పదవులు. అరిచేవారు కేవలం అవసరార్థం మాత్రమే ఉపయోగపడే మనుషులు.
ఆ విధంగా కొడాలి నాని ఇంటికే ! ఆ విధంగా పేర్ని నాని ఇంటికే ! ఆ విధంగా ఆళ్ల నాని కూడా ఇంటికే ! వీర విధేయుడు అయిన దాసన్న ప్లేస్ లో ఆయన తమ్ముడు ప్రసాదరావు వస్తున్నారు. కనుక పెద్దగా ఈ మార్పును శ్రీకాకుళం ప్రజలు పట్టించుకోరు. పైగా సీనియర్ అయిన ధర్మాన ప్రసాదరావుకు కొన్ని అదనపు బాధ్యతలు కూడా ఉండనున్నాయి.
అప్పట్లో క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా ఓ నోట్ కూడా ప్రిపేర్ చేయడం మనవాళ్లకు రాదని సీఎం వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు పెద్దిరెడ్డి దగ్గర చేశారు. ఆ విషయంలో సీనియర్ లెజిస్లేటివ్ మెంబర్ గా ధర్మాన ప్రసాదరావు కడు సమర్థులు కనుక ఇకపై అటువంటి ఉండవు.
అదేవిధంగా ప్రభుత్వ వ్యవహారాలు కొన్ని ఆయనకు అప్పగించి వైఎస్ జగన్ జిల్లా పర్యటనకు రానున్నారు.
అదేవిధంగా నిన్నటి వేళ క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలికిన వారిలో కొందరిని మళ్లీ తీసుకున్నా అదంతా తప్పక చేసిన పనిగానే గుర్తించాలి అని కూడా అంటున్నాయి వైసీపీ వర్గాలు. ప్రత్యామ్నాయం లేకనే సీదిరి అప్పల్రాజును కానీ చెల్లుబోయిన వేణును కానీ కొనసాగించనున్నారని అంటున్నాయి. అయితే సీనియర్లు మాత్రం బొత్సను కొనసాగిస్తే బాగుంటుందని సీఎంకు చెప్పారని కూడా టాక్. ఈ దశలో రానున్న 11వ తారీఖే కీలకం కానుంది. ప్రస్తుతానికి ఉద్వాసనలో ఉన్న మంత్రులంతా భావోద్వేగాలను నియంత్రించుకుని పార్టీ కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నిన్నటి సమావేశంలో జగన్ హితవు చెప్పారని ప్రాథమిక సమాచారం.