ఆంధ్రప్రదేశ్ శాసన సభలో 2024-2025 ఆర్థిక సంవత్సరం ఏపీ బడ్జెట్ ను ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.2,94,427 కోట్లతో ఏపీ బడ్జెట్ ను అసెంబ్లీలో పయ్యావుల ప్రవేశపెట్టారు. 1995లో నాటి ఆర్థిక శాఖా మంత్రి చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేసుకొని పయ్యావుల బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు.
గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని, దానిని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని పయ్యావుల అన్నారు. నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ.. అభివృద్ధి.. సంక్షేమాన్ని సమతూకం చేస్తూ బడ్జెట్ రూపొందించామని చెప్పారు.
రూ.2,94,427 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
రెవెన్యూ వ్యయం అంచనా -రూ.2.35 లక్షల కోట్లు
మూలధన వ్యయం అంచనా -రూ.32,712 కోట్లు
రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు
ద్రవ్యలోటు -రూ.68,743 కోట్లు
జీఎస్డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
వివిధ రంగాలకు కేటాయింపులు:
పాఠశాల విద్య రూ.29,909కోట్లు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
మహిళ, శిశు సంక్షేమం రూ.4,285కోట్లు
మానవ వనరుల అభివృద్ధి రూ.1,215కోట్లు
పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.18,421కోట్లు
పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012కోట్లు
రోడ్లు, భవనాలకు రూ.9,554కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127కోట్లు
యువజన, పర్యాటక, సాంస్కృతిక రూ.322కోట్లు
జలవనరులు రూ.16,705కోట్లు
పర్యావరణ, అటవీశాఖకు రూ.687కోట్లు
ఇంధన రంగం రూ.8,207కోట్లు
పోలీస్ శాఖకు రూ.8,495 కోట్లు
స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు
పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు
ఇంధన శాఖ -రూ.8,207 కోట్లు
189 కి.మి. పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం
స్టేట్ హైవేల కోసం రూ.600 కోట్లు కేటాయింపు
ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కోసం 3శాతం రిజర్వేషన్
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ. 322 కోట్లు