ఇది స్వయానా తమ పార్టీ ఏపీ అధ్యక్షుడితో కేంద్రం చెప్పించిన మాట. అయినా దీనిపై మాట్లాడటానికి వైసీపీ వారికి గాని, ప్రత్యక హోదా మీద చంద్రబాబును నిలదీసిన జగన్ కి కాని నోరు పెగలదు. బీజేపీ ఎంత బరితెగించింది అంటే… అమరావతితో మాకేం సంబంధం అని గుంటూరు కృష్ణా వారిని ఏడిపించి, పోలవరం డబ్బులు ఇవ్వకుండా గోదావరి జిల్లాల ప్రజలను ఏడిపించి… ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీ మొత్తాన్ని ఏడిపించి…తిరుపతిలో మేమే గెలుస్తాం అంటుంది.
అసలు ఏ మాట నమ్మి, ఏం నచ్చి ఏపీ ప్రజలు బీజేపీకి ఓటేయాలి. పోనీ వీర్రాజును చూసి వేయమంటారా అంటే వచ్చే ఒకట్రెండు ఓట్లు కూడా ఆయన వల్ల రాకుండా పోయే ప్రమదం స్పష్టంగా ఉంది. స్వామి భక్తి, పార్టీ భక్తి తప్ప ఏపీ బీజేపీ నేతలకు ఏ కోశానా రాష్ట్రం పై ప్రేమ లేదు, అభిమానం లేదు. నమ్మకం లేదు. ఇష్టం లేదు. అయినా తిరుపతిలో గెలుస్తాం అటూ ప్రగల్బాలు పలుకుతుంది. చరిత్రలో ఏనాడూ ఒంటరిగా 50 వేలు తెచ్చుకోలేదు తిరుపతిలో. అలాంటిది జనసేనను అవమానించి తానే తిరుపతి సీటును దక్కించుకుంటాను అని బీజేపీ చేసే ప్రయత్నం ఎంత సిల్లీగా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
వీర్రాజు ఇంటర్వ్యూ చూడండి… తెలుగు ఛానెల్ తో మాట్లాడుతు మేము ప్రత్యేక హోదా ఇవ్వం అని తెగించి చెప్పేస్తున్నారంటే… వీళ్ల ధైర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి.