ఏపీలో మరో నెలన్నర రోజుల్లో సార్వత్రక ఎన్నికలు జరగబోతోన్న నేపథ్యంలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీజేపీకి కేటాయించిన 6 లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించగా..తాజాగా 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ హై కమాండ్ ప్రకటించింది.
ధర్మవరం నుంచి వై సత్యకుమార్ పోటీ చేస్తుండగా ఎచ్చెర్ల నుంచి ఎన్ ఈశ్వర్ రావు బరిలోకి దిగనున్నారు. విశాఖ నార్త్ నుంచి పి. విష్ణుకుమార్ రాజు, అరకు- పంగి రాజారావు, అనపర్తి- ఎం శివకృష్ణంరాజు, కైకలూరు- కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్- సుజనా చౌదరి, బద్వేల్ – బొజ్జ రోషన్న, జమ్మలమడుగు-సి. ఆదినారాయణ రెడ్డి, ఆదోని-పీవీ పార్థసారథిని ఖరారు చేశారు.
అయితే, తన అనుయాయులు సోము వీర్రాజు, విష్ణువర్థన్ రెడ్డిలకు మాత్రం టికెట్లు ఇప్పించుకోవడంలో జగన్ విఫలమయ్యారని తెలుస్తోంది. బీజేపీలో బాబు మాటే నెగ్గడంతోనే జగన్ చెప్పినట్లు జరగలేదుని, చంద్రబాబు చెప్పిన విధంగానే బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని టాక్ వస్తోంది. ధర్మవరంలో సూరికి కాకుండా సత్యకుమార్ కు టిక్కెట్ ఇవ్వడంతో పరిటాల కుటుంబాన్ని శాంతింపజేసినట్లయింది.
ఇక, సుజనా చౌదరి. రఘరామకు టికెట్ రాకుండా ఉండేందుకు జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లయింది. రఘురామకు తప్ప వేరే ఎవరికి ఆ సీటు ఇచ్చినా దానిని వైసీపీ వదులుకుంటుంది అని జగన్ బతిమాలినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కూటమిలో బాబు మాట నెగ్గి బీజేపీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలుస్తోంది.