అనుష్క చాలాకాలం నుంచి కొత్త ప్రాజెక్ట్‌లకు సంతకం చేయకపోవడంపై టాలీవుడ్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియాలో బాహుబలితో ఎంతో గుర్తింపు తెచ్చుకుని ఎందుకు ఆమె సమయాన్ని వృథాచేస్తుందని అందరూ అనుకున్నారు. అందరి అనుమానాలకు ఆమె ఇపుడు ఫుల్ స్టాప్ పెట్టింది.
UV క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగుకు ఆమె సిద్ధమైంది.
మిర్చి, భాగమతి తర్వాత యూవీ క్రియేషన్స్‌తో అనుష్క కలిసి నటిస్తున్న మూడో చిత్రం ఇది.
ఇది ఒక క్రేజీ సబ్జెక్ట్ కావడంతో అనుష్క వెంటనే స్క్రిప్ట్‌ను ఇష్టపడింది. అదొక రొమాంటిక్ కామెడీ సబ్జెక్ట్ అంటున్నారు.
మహేష్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి,
త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. నటీనటులు మరియు సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.