నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వకపోవడం రోగం అన్నారు మన పెద్దలు. కానీ ఆ నవ్వే ఇప్పుడు మన సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కి శాపంగా మారింది. సూపర్ మూవీ తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. విక్రమార్కుడితో స్టార్ హోదాను అందుకుని.. అరుంధతితో సినీ అభిమానుల హృదయాల్లో చోటు దక్కించుకుని.. బాహుబలి తో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న అనుష్క శెట్టి ప్రస్తుతం ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోంది.
అనుష్కను కలవర పెడుతున్నది లాఫింగ్ డిసీజ్. ఇటీవల ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. సాధారణంగా అందరూ ఒకటి లేదా రెండు నిమిషాలు నవ్వుతారు. కానీ అనుష్క మాత్రం కామెడీ సన్నివేశాలను చూస్తున్నప్పుడు లేదా షూట్ చేస్తున్నప్పుడు నవ్వడం స్టార్ట్ చేసిందంటే.. 15 నుండి 20 నిమిషాలు కంటిన్యూగా నవ్వుతూనే ఉంటుందట. కొన్నిసార్లు కిందపడి పడేలా నవ్వు వస్తుందట.
తనకున్న ఈ లాఫింగ్ డిసీజ్ కారణంగా చాలా సార్లు షూటింగ్స్ సైతం ఆగిపోయాయని అనుష్క చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి ఆమె అభిమానులు మరియు సినీ ప్రియులు ఇటువంటి వ్యాధి కూడా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, అనుష్కను ఇబ్బంది పెడుతున్న ఈ లాఫింగ్ డిసీజ్ ను సూడోబుల్బార్ ఎఫెక్ట్ (PBA) అంటారు. నాడీ సంబంధిత రుగ్మత ఇది. ఈ రుగ్మత ఆగని నవ్వు లేదా ఏడుపును కలిగిస్తుంది. ఈ వ్యాధి తలెత్తడానికి కచ్చితమైన కారణాలు లేవు మరియు నివారణ కూడా లేదు. కానీ కంట్రోల్ చేయడానికి మందులు మాత్రం ఉన్నాయి. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే.. చివరగా ఆమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ఘాతీ, కథనార్ – ది వైల్డ్ సోర్సెరర్ వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తోంది.