అనుపమ పరమేశ్వరన్.. మోస్ట్ క్యూట్, మోస్ట్ పాపులర్ హీరోయిన్. అవార్డులు ఓకే గాని అవకాశాలేవీ అంటోందీ పిల్ల. పాపం ఎందుకో పదుగురు మెచ్చిన ఈ సుందరికి సరైన అవకాశాలే పడలేదు. పాపం మళయాళం నుంచి వచ్చి తెలుగు కూడా నేర్చేసుకుంది. నాగవల్లి క్యారెక్టర్ దెబ్బనో ఏంటో సెకండ్ హీరోయిన్ గా మిగిలిపోయింది. పాపం ఈ కుర్రదానికి ఫ్యాన్స్ ఎక్కువ అని పెద్ద హీరోయిన్ చేద్దామని ఇండస్ట్రీ కొన్ని అవకాశాలు ఇచ్చి ట్రై చేసింది. కానీ నిలబడలేదు.
కెరీర్ ఆరంభంలో ప్రేమమ్, అఆ, శతమానం భవతి లాంటి సినిమాలతో ఆమె కెరీర్ బానే ఉంది. కానీ కేవలం శతమానం భవతి మాత్రమే సింగిల్ లీడ్. ఆ తర్వాత రామ్ తో చేసిన సినిమాలు ఆడలేదు. దీంతో పిల్ల కెరీర్ ముందుకు పోలేదు. వరుసగా ఫ్లాపులొచ్చాయి. అయినా అవకాశాలు ఇచ్చారు. అయినా ఎందుకో సెట్టవలేదు ఇక్కడ.
ఇక టాలీవుడ్లో అనుపమ కెరీర్ ముగిసింది అనుకుంటుంటే… ఎట్టకేలకు మళ్లీ ఓ ఛాన్స్ దక్కింది. కానీ ఇపుడే మెల్లగా ఎదుగుతున్న నిఖిల్ తో. అంటే నిఖిల్ ఎదిగాడనా.. అనుపమ గ్రాఫ్ దిగిందనా అన్నది అర్థం కాలేదు. సుకుమార్ స్క్రిప్టుతో ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మిస్తున్న సినిమా ఇది. బ్యానర్ మంచిది. దర్శకుడి బ్యాగ్రౌండ్ బాగుంది. ఈ సినిమాతో అనుపమ ఫేట్ మారితే ఓకే. లేకపోతే ఇక తెలుగు వారికి సంబంధించినంత వరకు సోషల్ మీడియా హీరోయిన్ గా మిగిలిపోతుందీ సుందరి.