అందం, అభినయం.. ఇవి రెంటికీ తోడు లవబుల్గా అనిపించే వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్లు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంటారు.
ఈ తరం హీరోయిన్లందరూ దాదాపుగా ఇలాగే ఉంటున్నారు.
నటిగానే కాదు, పర్సనల్ గా కూడా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు నేటి నటీమణులు.
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలా లవబుల్గా అనిపించే అమ్మాయే. అనుపమ ఇప్పటిదాకా నటించిన ఏ సినిమాలో కూడా తన నటన బాగా లేదు అనేలా ఉండదు.
తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అఆ’ నాగవల్లి పాత్ర నుంచి ప్రతి సినిమాలోనూ అనుపమ ఆకట్టుకుంటూనే ఉంది.
ఆమె నవ్వులకు, ఆమె కళ్లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
తాజాగా ఆమె ఓ ఫంక్షన్లో కురిపించిన నవ్వులు మెరుపులకు కళ్లు మిరుమిట్లు గొలిపాయి
https://twitter.com/juicythoppul/status/1451145313536802819