ఏపీ రాజధాని అమరావతి రైతులు.. ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరా వతినే ఉంచాలని డిమాండచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండేళ్లుగా రైతులు ఉద్యమిస్తున్నారు. వీరికి మద్దతుగా.. అనేక ప్రజాసంఘాలు కూడా ప్రబుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. ఇక, ఈ క్రమంలోనే రాజ ధాని రైతులు.. మహాపాదయాత్ర చేపట్టారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలమీదుగా శ్రీవారి దర్శనంతో ఈ యాత్ర ముగియనుంది. ఈ రోజు అంటే.. మంగళవారం.. యాత్రను ముగించనున్నట్టు.. అమరావతి రైతు జేఏసీ నేతలు తెలిపారు.
అయితే.. ఇక్కడితో తమ ఉద్యమం ఆపేయాలని రైతులు భావించడం లేదు.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని.. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసే వరకు తమ ఉద్యమం కొనసాగు తుందని వారు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే.. అప్పటి వరకు ఏదో ఒక రూపంలో తమ ఉద్యమాన్ని ముం దుకు తీసుకువెళ్తామని కూడా వారు చెబుతున్నారు. ముఖ్యంగా.. పాదయాత్రకు వచ్చిన భారీ స్పందన నేపథ్యంలో మున్ముందు.. మరో యాత్ర చేపట్టాలని రైతుల జేఏసీ నిర్ణయించింది. దీని ప్రకారం.. మరో 20 రోజుల గ్యాప్లో అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర నిర్వహించి.. రాజధాని ప్రాముఖ్యాన్ని వివరించాలని నిర్ణయించినట్టు జేఏసీ నేతలు తెలిపారు.
అంటే.. ఇప్పుడు చేపట్టిన యాత్ర కేవలం 4 జిల్లాలకు మాత్రమే పరిమితమైందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో రైతుల జేఏసీ నేతలు సదరువిమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే మరో పాదయాత్రకు మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా.. మిగిలిన 9 జిల్లాలను కవర్ చేసేలా.. రాజధాని రైతులు మరో మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దీనిని అరసవల్లిలో ముగించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. తద్వారా.. ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా.. అమరావతి రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా వినిపించాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ యాత్ర జనవరి 20 తర్వాత.. ఉంటుందని చూచాయగా ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నెల 17తో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర ముగియగానే.. దీనికి పక్కా ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.