తన కొడుకు లాంటి జగన్ ను మోడీ చక్కగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన అడిగినంత అప్పు ఇస్తూ బీజేపీ – వైసీపీ రహస్య పొత్తును విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
కేవలం 35 రోజుల్లో ఏపీకి మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం మూడు సార్లు అప్పులకు అనుమతిచ్చింది. పక్షం రోజులకొకసారి రాష్ట్రం నుంచి ఆర్థికమంత్రి, అధికారులు ఢిల్లీ వెళ్లడం, అప్పులు తేవడం వెరీ కామన్ అయిపోయింది.
ఏపీకి అప్పులు ఇస్తే అది జగన్ కి మేలు చేస్తుంది కానీ ఏపీ ప్రజలకు నష్టం చేస్తుంది. అయినా బీజేపీకి జగన్ కావాలి గాని ఏపీ లాభనష్టాలు అవసరం లేదు కదా. రేపు ఈ అప్పులు తీర్చాల్సింది ఏపీ ప్రజలే. ఎందుకంటే ఏపీకి ఆదాయం పెరగాలంటే పన్నులు వేయాలి. పన్నులు వేస్తే రాష్ట్రంలో వస్తువుల ధరలు పేదలతో పాటు అందరికీ పెరుగుతాయి. డబ్బున్నోడు ఎంతైనా పెట్టి కొంటాడు. పేదోడికే కదా ధరల వల్ల ఇబ్బంది. ఈ చిన్న కీలక మైన లాజిక్ జనాలకు ఎక్కడం లేదు.
మోడీ సర్కారు… జగన్ ను అప్పుల లెక్కలు చెప్తేనే కొత్త అప్పులకు అనుమతంటూ హెచ్చరిస్తున్నట్లు నటిస్తూనే ఠంచనుగా అప్పులు ఇస్తూ ఉంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేయాలనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) క్లియర్ గా చెబుతోంది. ఆయా రాష్ట్రాల జీఎ్సడీపీ ఆధారంగా కేంద్రం ఈ పరిమితిని నిర్ణయిస్తుంది. ఏడాదికొక్కసారే ఈ పరిమితిని నిర్ణయిస్తారు. ఆ పరిమితి మేరకు రాష్ట్రాలకు ఏడాదికి రెండుసార్లుగా కేంద్రం అనుమతిస్తుంది. కానీ, ఏపీకి మాత్రం అన్ని నిబంధనలు పక్కన పెట్టి బీజేపీ వైసీపీ కి హెల్ప్ చేస్తోంది.
ఉద్యోగుల జీతాలకు ఆర్బీఐ నుంచి ఓడీ అప్పు తెచ్చి కొంతమేర చెల్లించారు. అప్పు లేకుండా పూట కూడా గడవలేని దుస్థితిలో రాష్ట్రం ఉన్నందున మోడీ సర్కారు వద్ద మోకరిల్లి అప్పులు తెచ్చుకుని కాలం గడుపుతున్నారు. ఏపీ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.