టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఏపీ సీఐడీ తాజాగా మరో కేసు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. తన హయాంలో చంద్రబాబు మద్యం కంపెనీలకు అక్రమ అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. చంద్రబాబును ఏ3గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.
దీంతో, చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసేందుకు సీఐడీ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఇక, స్కిల్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ లో ఉంచింది. రేపు తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిపే తేదీలు రేపు నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది.