పేదల ఇళ్లను నిర్దయగా కూల్చడానికి ప్రయత్నించిన ప్రభుత్వ దుడుకుతనానికి బ్రేకులు పడ్డాయి.
ముఖ్యమంత్రి జగన్ ఇంటి సమీపంలో పేదల ఇళ్లను ఖాళీ చేయిస్తున్న పేదల ఇళ్ల కూల్చివేతను కోర్టు ఆపేసింది.
అయితే శాశ్వతంగా కాదు, వారికి తగినంత గడువు ఇవ్వాలని ఆదేశించింది.
భద్రతా కారణాల పేరుతో సీఎం జగన్ తాడేపల్లి నివాసం పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేయగా వారు ప్రతిపక్షాల సాయంతో కోర్టుకు వెళ్లారు. ఆ నిర్వాసితులు ఖాళీ చేయించటంపై హైకోర్టులో విచారణ జరిగింది.
నిర్వాసితులను ఉన్న ఫలంగా పంపించి వేయవద్దని, ఆగస్టు 6 వరకు ఖాళీ చేయించవద్దని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
అప్పటి లోపు అక్రమంగా నిర్మించుకున్న ఇండ్లను ఖాళీ చేయాలని, తాత్కాలిక నివాసాలు చూసుకొని ఖాళీ చేయాలని నిర్వాసితులకు హైకోర్టు సూచించింది.
విచిత్రం ఏంటంటే… రావాలి జగన్ కావాలి జగన్ అని పాటపాడిన పేదల గుడిసెలనే సీఎం జగన్ భద్రతా కారణాలు చెప్తూ పీకేయడం విచిత్రం.
జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూల్చివేతలు తప్ప నిర్మాణాలు లేవు. రెండేళ్లలో లెక్కలేనన్ని కూల్చివేతలు జరిగాయి.