నాయుడుపేటలో జన నీరాజనం#lokeshinSullurupeta#YuvaGalamPadayatra#YuvaGalam#LokeshPadayatra #NaraLokesh#NaraLokeshForPeople#yuvagalamlokesh pic.twitter.com/kC3NslH8Hj
— Telugu Desam Party (@JaiTDP) June 25, 2023
ఒకటి అని నాలుగు అనిపించుకునేందుకు రెడీ అనే వైసీపీ నాయకుడు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విషయంలో నెటిజన్లు కూడా అలానేరియాక్ట్ అవుతున్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన విమర్శలపై అంతే దీటుగా రియాక్ట్ అయ్యారు. లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర కాదని.. అదో విహారయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర చేస్తే ఉదయం నుంచి రాత్రి వరకు చేశారన్నారు.
సాయంత్రం 4 గంటలకు కాసేపు నడిచి లోకేష్ కాలయాపన చేస్తున్నారని అనిల్ వ్యాఖ్యానించారు. అయితే.. నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ.. నారా లోకేష్ ముందుగానే షెడ్యూల్ ప్రకటించారని.. దాని ప్రకారమే పాదయాత్ర చేస్తున్నారని.. ఇంకా చెప్పాలంటే.. షెడ్యూల్లో పేర్కొన్న దానికంటే ముందే నిర్ణీత దూరం దాటేస్తున్నారని చెబుతున్నారు. విషయం ముందు మీరు తెలుసుకోవాలని అనిల్ బ్రో అంటూకొందరు వ్యాఖ్యానించారు.
ఇక, అనిల్ తన వ్యాఖ్యల్లో లోకేష్ మాట్లాడే ముందు భాష నేర్చుకోవాలని హితవుపలికారు. “భాష గురించి.. వైసీపీ నాయకులు.. ముఖ్యంగా అనిల్ దగ్గరే ఎవరైనా ట్యూషన్ పెట్టించుకోవాలి. నిజమే“ అని కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు ‘‘లోకేష్‌కు నిజంగా దమ్ముంటే జిల్లాలో అభివృద్ధిపై చర్చకి రావాలి. సమయం, వేదిక నీ ఇష్టం.. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎవరి హయాంలో జరిగాయో తెలుసా? జిల్లాలో పెన్నానదిపై సంగం, నెల్లూరు బ్యారేజీలు ఎవరు పూర్తి చేశారో తెలుసా?. నెల్లూరు సిటీలో చర్చిద్దాం.. దమ్ముంటే రా… లోకేష్’’కు అనిల్ ఛాలెంజ్ విసిరారు.
ఈ వ్యాఖ్యలపై నెటిజన్లురియాక్ట్ అవుతూ.. అవును.. ముందు `పోలవరం` గురించి చర్చించాలి. పోలవరంపై అనిల్ సర్.. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల గురించి.. పెట్టిన గడువు గురించి చర్చించాలి.. కనీసం ఇప్పటికైనా.. దాని గురించి నిజాలు అందరికీ తెలుస్తాయి.. అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్రమంతా పాదయాత్ర తరువాత ముందు మంగళగిరిలో గెలువు చూద్దామన్నన్న అనిల్ వ్యాఖ్యలపై మండిపడుతూ.. కర్ణాటకలో భారత్ జోడో యాత్ర ప్రభావం కనిపించలేదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ పాదయాత్ర ఎఫెక్ట్ కనిపిస్తుందని అన్నారు.
ఆనం కుటుంబం పట్ల ఇంకా మంచిపేరు ఉందంటే అది విజయ్ కుమార్ రెడ్డి వల్లే అని అనిల్ అన్నారు. ఎమ్మెల్యే అవకాశం ఇస్తే జగన్‌ను విమర్శిస్తావా? అంటూ మండిపడ్డారు. జిల్లాలో అభివృద్ధిపై ఆనం వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి ఆనం రాజీనామా చేసి వెళ్ళాలి అని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపైనా నెటిజన్లు వ్యాఖ్యలు సంధించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా.. అనిల్ సర్ అంటున్నారు. అయితే.. అనర్హత వేటు వేసే అవకాశం మీచేతిలోనే ఉంది.. దానిని ఎందుకు వదులుకుంటున్నారు? అని ప్రశ్నించారు. మొత్తానికి అనిల్ కామెంట్లకు అదే రేంజ్లో నెటిజన్లు ఫైర్ కావడం గమనార్హం.
OMG 🔥🔥💥💥 Nellore
Land, Sand, Mine, Wine mafia by ycp – @naralokesh#Naidupeta pic.twitter.com/VqjQEqukX2— Shylaja 🦋 (@Shylaja_Sakura) June 25, 2023