కొన్ని కొన్ని పరిణామాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఇప్పుడు వైసీపీ అధినేత, సీఎం జగన్ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఒకప్పుడు.. ప్రతిపక్షంలో ఉన్న జగన్..త నకు పోలీసులపై నమ్మకం లేదని అన్నారు. తనపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి ఘటన సమయంలో ..ఏపీలోనే విచారణకు ఆదేశిస్తామని.. అప్పటి సీఎం చంద్రబాబు ప్రకటించారు.
అయితే.. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని.. పొరుగు రాష్ట్రంలోనో.. సీబీఐకో ఇవ్వాలని అన్నారు. తర్వాత.. ఈ కేసును స్థానిక పోలీసులే విచారించారు. అయితే.. తాను అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా.. ఇప్పటి వరకు జగన్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు ఏపీలో జగన్ పాలనే సాగుతోంది. ఆయన హయాంలోనే పోలీసులు ఉన్నారు. సో.. ఇప్పుడుతనకు.. తన పార్టీ నేతలకు.. తన కుటుంబానికి కూడా.. పోలీసులపై నమ్మకం ఉండాలికదా!! ఈ మాటలో తిరుగు ఏముంటుంది? మరో మాట ఏముంటుంది? ఉంటుంది.. ఉండి తీరాలి కూడా. ఎందుకంటే.. అత్యంత పారదర్శకంగా.. ఏపీ పోలీసులను మలిచానని.. సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు కాబట్టి!!
కట్ చేస్తే..తాజాగా.. సీఎం జగన్ కుటుంబానికి చెందిన వివాదమే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. తనపాలనపైనా.. తీవ్రప్రభావం చూపుతోంది. తన సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న వైనంపై ఆయన కుమార్తె.. జగన్కు సోదరి.. సునీతా రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏపీ పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కయ్యారని.. ఇక్కడ తమకు న్యాయం జరగదని.. ఈ కేసు తేలదని.. మరో 10 సంవత్సరాలు అయినా.. ఈ కేసు ఇలానే ఉంటుందని.. ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టుకు వెళ్లారు. వాస్తవానికి.. సుప్రీం కోర్టు తొలుత సునీత వాదనను పట్టించుకోలేదు. కానీ, క్షేత్రస్థాయిలో సీబీఐ అధికారులు.. ఇతర వర్గాల నుంచి తెప్పించుకున్న అధికారిక సమాచారంతో .. ఔను.. సునీత చెబుతున్నది నిజమే!! అని ఇటీవల సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
పోలీసులు నేరస్తులతో కుమ్మక్కయ్యారని.. తేల్చేసింది. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రానికి కేసు అప్పగించేస్తామని తెలిపింది. మరి ఇది.. జగన్ చెబుతున్న విశ్వాసం.. అనే మాటకు విరుద్ధం గా లేదా? పోలీసులపై అప్పట్లో తనకునమ్మకం లేదన్న జగన్ పాలనపైనే సుప్రీం కోర్టు ఇలా వ్యాఖ్యానించడం.. తీవ్రంగా పరిగణించడమే కదా!!ఇది రాష్ట్ర పరువును తీయడమే అవుతుంది కదా!! అంటున్నారు పరిశీలకులు.