ఆంధ్రారెడ్డి + గోల్డ్ స్టోన్ ప్రసాద్ + కేసీఆర్ =
12 బద్మాష్ కంపెనీలు
2016 – 2017ల్లో ఏర్పాటు..
దొర బంధువులకే కోట్లు.. దమ్ముంటే .. “దొరా నీకు సంబంధం లేదని సెప్పు రా..!”
తెలంగాణలో ‘దొర’ దొంగలందరూ ఒక బ్యాచ్. మిగిలిన వారందరూ ఒక బ్యాచ్. మరో రెండేళ్లు నిజాయితీపరులకు ఇబ్బందులు. అక్రమ కేసులు. జైళ్ళల్లో నిర్భంధాలు. ఓయ్.. దొరా..! నీ ఏశాలు ఆపు.. ఈ దొంగల బ్యాచ్ లో నీ వాళ్ళు ఎంతమంది.? నీ దరిద్రపు బ్యాచ్ ఎంత మంది ఉన్నారు.? నీకు సెప్పే ధైర్యం ఎలాగో ఉండదు. మీం సెపెతాం.. దమ్ముంటే రా.. బహిరంగ చర్చకు సిద్దం. ఆ డజను కంపెన్నీల్లో భాగస్తులు ఎవరు.? ఆ ‘నడమంత్రపు సిరి దొంగలు’ ఎవరు. వాళ్ళ బినామీ బద్మాష్ ఎవరు.?
అసలేం జరిగింది..:
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉదంతాలను దృష్టిలో ఉంచుకొని ఈ మాయగాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అందరికీ తెలిసిన సత్యం (SATYAM) తిరగేసి రాస్తే….మైటాస్..(MAYTAS). ఈ పేరుతో దోచుకోవల్సినంత దోచారు. దేశ ప్రజలు.. ప్రత్యేకంగా తెలుగు… ఇంకా లోపలికి వెళ్ళితే తెలంగాణ ప్రజలు అమాయాకులనే భావనతో ఈ పని చేశారు. మైటాస్ దొంగ ఎవరో తెలుసా..? ఆ తేజ ఎవడు.?
‘తీన్మార్’లో అందరూ ‘తీసి కట్టే’..!:
గులాబీ కారు యజమాని ఆయనే. ఆయన సృష్టించిన సామ్రాజ్యం. మిగిలిన వారంతా టిక్కెట్ లేని తాత్కాలిక ప్రయాణికులే. ఆశ పడ్డ, మోజుపడ్డ వాళ్ళు అవసరాల మేలకు వస్తారు. వెళతారు. కేసీఆర్ కు మాత్రం నచ్చకుంటే అర్థంతరంగా తన్ని తగలేస్తాడనే ఆరోపణలు. అందులో గాదె ఇన్నయ్య, పాఠాలు నేర్పిన పాశం యాదగిరి, టైగర్ ఆలె నరేంద్ర, రాములమ్మ, ఇంటిపార్టీ సుధాకర్, విజయశాంతి.. “పాపం వీళ్ళిద్దరూ తమ పార్టీలను ‘గంగ’లో కలిపినట్లు ‘కారు’లో కలిపేసి.. కన్నీళ్లు రాని కళ్ళతో బతుకు జీవుడా..!” అంటూ బయడపడ్డారు. ప్రొఫెసర్ కోదండరాంను బాగానే వాడి(గా) వదిలేశారు. ఇలా ఓ పెద్ద లిస్ట్ ఉంటుంది. వీళ్ళందరూ కేసీఆర్ మేథస్సును తక్కువగా అంచనా వేసినవాళ్ళే.!
ఆ నలుగురూ..:
ముఖ్యమంత్రి కేసీఆర్ కు బయటపోరు కొందరి జర్నలిస్టుల నుంచి మినహా పెద్దగా ఏం లేదు. వాళ్ళతోనే భయం అంతా..? కానీ., ఇంటి పోరు ఉన్నట్టు గుసగుసలు. అసెంబ్లీ ఎన్నికలు కాగానే యువరాజు కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆయన పట్టాభిషేకం ఎప్పుడెప్పుడా.? అని ఎదురుచూస్తున్న నాయకులు ఉన్నారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే రాజకీయాలు ఎందు..కు.? ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లు రాజకీయ పరిశీలకుల భావన. ముఖ్యమంత్రి కావాలని ఏ నాయకుడికి ఉండదు. ఆ దర్పం అనుభవించాలను కోవడం తప్పుకూడా కాదు. కేసీఆర్ రాజకీయ వారసులుగా కేటీఆర్ రాజరికపు వారసత్వ అర్హులు. అయితే ఇటీవల పరిణామాల కారణంగా వారి కుటుంబం నుంచే ఇంకొందరి పేర్లు బయటకు వస్తున్నాయి. కూతురు కవితమ్మ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం. మహిళలల కోటాలో ఆమే ప్రథమం. ఏ చిన్న కుదుపు వచ్చినా… కళ్ళన్నీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు వైపే. ఆయన ఏనాడూ బయటపడలేదు. ఇక ఇటీవల సంతోష్ పేరు నర్మగర్భంగా నానుతోంది. సర్థుబాటు వ్యవహారాలలో ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చిన్న జియ్యర్ స్వామితో సత్సంబంధాలు ఉన్నా… ఆయన ఆర్దిక బహు బంధాలు ఆయనవి. పదవుల పందేరాలలో స్వామి సలహాలు ఇవ్వరు. ఎదగని నాయకుల జాబితాలో ఈటెల రాజేందర్ ఉన్నారు. ఆయనకు అవకాశాలు తక్కువే కానీ… అవసరార్థ పరిస్థితులను అంచనా వేయలేం కదా..? కాబోయే ముఖ్యమంత్రి విషయంలో కేసీఆర్ కు ఒక నిశ్చింత అభిప్రాయం తప్పకుండా ఉంది. అది ఆయన ఎప్పుడు బయటపెడతారో చెప్పలేం.
ఈ కంపెనీల డైరెక్టర్ల కథ ఏమిటి..? ‘ప్రభుత్వ పెద్దరకు ఈ కంపెనీలకు లింకేమిటి..?’ అనే విషయంలో ఓ ఊహించని ‘ఇచ్చి పుచ్చుకునే కూపీ’ బయటకు వచ్చింది. ఆ కంపెనీల జాబితా ఇది. ఇందులో కేసీఆర్ బంధువుల వాటాలు ఉన్నట్లు తెలిసింది.
(1). హాల్మార్క్ ఇన్ఫ్రా-కాన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
(2). సిజనస్ ఇన్ఫ్రా అండ్ రికాన్కన్ ప్రైవేట్ లిమిటెడ్
(3). కారోలినా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
(4). వెర్ టెక్స్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
(5). డిఎస్ఎస్ సహజ వనరుల ప్రైవేటు సంస్థ
(6). సియాన్ ఇన్ఫ్రా
(7). ఆకార మైనింగ్ ఒయర్స్ ప్రైవేట్ లిమిటెడ్,
(8). వశిష్టా ప్రైవేట్ లిమిటెడ్
(9). అక్బోబియ ప్రైవేట్ లిమిటెడ్
(10). మూవోన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్
(11). కర్వి సోలార్ పవర్ లిమిటెడ్
(12). షార్ప్ వెంచర్ ప్రైవేట్
2016-17 సంవత్సరాలలో ఇవి ఏర్పాటు జరిగాయని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ‘కాల్ హెల్త్’కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థలలో కల్వకుంట్ల బంధువులు, సన్నిహితులు భాగస్వామ్యులుగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి.
అనంచిన్ని వెంకటేశ్వరరావు