తెలుగు బుల్లితెరపై మాటల సెలయేరు సుమ కనకాల గురించి తెలియని వారుండరు.
కేరళ అమ్మాయి అయినప్పటికీ ఆమె తెలుగు అంత స్పష్టంగా మాట్లాడుతుంది. తెలుగు యాంకర్లు కూడా ఆమెంత స్పష్టంగా తెలుగును ఉచ్ఛరించలేరు.
యాంకరింగ్‌లో, రియాల్టీ షోల్లో ఆమె తనదైన ముద్ర వేసుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
అలాంటి సుమ ఇప్పుడు బుల్లితెరపై తన సుదీర్ఘ ప్రయాణానికి కాస్తంత విరామిస్తున్నారు.
దాదాపు 15 సంవత్సరాలుగా బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ స్టార్ మహిళగా వెలిగిన సుమ కనకాల అంటే చిత్ర పరిశ్రమలో అందరికీ ఇష్టమే.
ఏ సినిమా ఫంక్షన్ జరిగినా ఆమె యాంకరింగ్ ఉండాలని నిర్మాతలు కోరుకుంటుంటారు.
అంతలా తన మాటల ప్రవాహంతో ప్రేక్షకులను కట్టి పడేస్తుంటారు సుమ.
ఆమె కామెడి టైమింగ్‌కు, పంచ్‌లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
అలాంటి సుమ తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. తాజాగా ఒక షోలో పాల్గొన్న సుమ తాను ఇక యాంకరింగ్‌కు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేను మళయాలీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను నన్ను తమ గుండెల్లో పెట్టుకుని ప్రేమించారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
అయితే కొంతకాలం యాంకరింగ్‌కు విరామం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడంతో అక్కడున్న మిగిలిన ఆర్టిస్టులంతా ఆమెకు శాలువాలు కల్పి సత్కారం చేశారు.
ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అయితే సుమ కనకాల యాంకరింగ్ కు గుడ్‌బై చెబుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చినా, ఇప్పుడు ఆమె టీవీ షోలో స్వయంగా చేసిన ఆ ప్రకటన నెట్టించ చక్కర్లు కొడుతోంది.