హాట్ యాంకర్ గా జబర్దస్త్ తో కెరీర్ ప్రారంభించిన అనసూయ…ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన ఇమేజ్ ను పెంచుకుంది. రంగ స్థలం నుంచి పుష్ప వరకు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ హాట్ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా విపరీతంగానే ఉన్నారు. అప్పుడపుడు తన అభిమానుల కోసం అనసూయ ఫేస్ బుక్ లైవ్ చాట్ లోకి కూడా వచ్చి సందడి చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రంగమ్మత్తకు…ఫ్యాన్స్ నుంచి ట్రోలర్స్ నుంచి విమర్శలు వస్తుంటాయి.
అయితే, వారికి దీటుగా అనసూయ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనసూయ తన డ్రెస్సింగ్ విషయంలో తరచుగా నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆమెకు అలాంటి అనుభవమే మరోసారి ఎదురైంది. గతంలో అనసూయ వేసుకున్న ఒక పొట్టి డ్రస్సుపై ఓ నెటిజన్ అభ్యంతరకర కామెంట్లు చేశాడు.
ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి…ఇలాంటి పొట్టి దుస్తులు ధరిస్తూ, తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నారంటూ విమర్శించాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై అనసూయ కూడా ఘాటుగానే స్పందించింది. ‘దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు’ అంటూ ఆ నెటిజన్ కు అనసూయ చురకలంటించింది.
కాగా, గతంలోనూ తన దుస్తులపై కామెంట్ చేసిన వారికి అనసూయ గట్టి డోస్ ఇచ్చింది. తాను కూడా అందరు ఆడపిల్లల్లాగే…..ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా.. తన కుటుంబం కోసం తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని అనసూయ చెప్పుకొచ్చింది. తాను చేసే పని, ధరించే దుస్తులు తన కుటుంబానికి ఇబ్బంది కలిగించడం లేదని, ఇతరులకు ఇబ్బంది ఎందుకని సూటిగా ప్రశ్నించింది. సోషల్ మీడియాలో మాట్లాడే స్వేచ్ఛ ఉందని ఎలా పడితే అలా కామెంట్స్ పెడుతున్నారని, ఆఖరికి తన భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం….అందరినీ దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రోజూ తనకు వచ్చే ఫోన్ కాల్స్, కామెంట్స్ తో మనశ్శాంతి ఉండడం లేదని, కనీసం ఆ విషయం గ్రహించే శక్తి కూడా వారికి లేదని మండిపడింది.