వామ్మో.. వామ్మో.. వినేటోళ్లు ఉంటే చెప్పేటోళ్లు చెలరేగిపోతుంటారంటారు కదా. తాజాగా ప్రముఖ యాంకర్ అనసూయ ఆంటీ నోటి నుంచి ఇప్పుడు ఆ మాటలే వస్తున్నాయి. ఆమె పేరు తలచినంతనే ఆమె చేసిన ఒక వెకిలి కామెడీ షో చప్పున గుర్తుకు వస్తుంది. ఆ షో గురించి ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే.. తెలుగు హాస్యాన్ని మరింత దిగజారేలా చేసిన కామెడీ షోగా దీన్ని చెప్పాలి. అయితే.. ఈ వెకిలి షోలోనూ కొన్ని సందర్భాల్లో ప్రదర్శించే స్కిట్స్ అదిరేలా ఉంటాయన్నది కూడా చెప్పాల్సిందే.
నిజానికి ఈ షో ద్వారానే అనసూయ పాపులర్ అయ్యింది. ఈ బుల్లితెర షోలో ఆంటీ తన ఏజ్ కు తగ్గట్లు కాకుండా టీనేజర్ మాదిరి చెలరేగిపోవటం.. తన హోయలతో ఈ వెకిలి షోకూ గ్లామర్ అద్దేసింది. ఈ షోలో ఏకంగా తొమ్మిదేళ్లు చేసిన ఆమె.. ఈ మధ్యనే దాని నుంచి బయటకు వచ్చేసింది. ఈ షో గురించి ఉన్న విమర్శల వేళ.. ఎందుకీ షో నుంచి తప్పుకున్నావంటే.. ఏదో ఒక కారణం చెబితే సరిపోయేది. అలా కాకుండా.. ఈ షోలో వెకిలి తట్టుకోలేకపోతున్నానంటూ చేసిన వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.
సదరు షోలో వెకిలి ఆంటీకి తొమ్మిదేళ్లు చేసిన తర్వాత కానీ అర్థం కాలేదా? అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో కావొచ్చు.. అమ్మడి నోటి నుంచి ఆ వివరణ వచ్చింది కానీ అది అతికినట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది. షో నుంచి బయటకు రావటానికి అనసూయ నోటి నుంచి వచ్చిన మాటేమంటే.. ‘దాదాపు రెండేళ్ల నుంచి షో నుంచి బయటకు రావటానికి ట్రై చేస్తున్నా. చాలాసార్లు నాపై వేసే పంచ్ లు నచ్చక సీరియస్ గా రియాక్షన్ ఇచ్చేదాన్ని. నాకు బాడీ షేమింగ్.. వెకిలి చేష్టలు అస్సలు నచ్చవు. చాలాసార్లు వాళ్లు వేసే పంచ్ లు నచ్చక ముఖం మాడ్చుకునేదాన్ని. కానీ..వాటిని షోలో వేయరు’ అంటూ చెప్పుకొచ్చింది.
తొమ్మిదేళ్ల నుంచి షో చేస్తున్న అనసూయకు గ్లామర్ తో పాటు.. పేరుప్రఖ్యాతులు వచ్చేసి దాదాపు ఐదారేళ్లకు పైనే ఉంది. అప్పటి నుంచే ఆమె స్టార్ యాంకర్. నిజంగా అంత నచ్చకపోతే.. ఇన్నాళ్లు కంటిన్యూ చేయటం ఎందుకు? అప్పడే గుడ్ బై చెప్పేస్తే బాగుండేది కదా? అని తప్పు పడుతున్నారు. వెకిలి కారణంగానే బయటకు వచ్చేసినట్లుగా ఇస్తున్న బిల్డప్ ఏ మాత్రం సరికాదంటూ అనసూయకు పంచ్ లు వేస్తున్నారు. అయినా.. వెకిలి అర్థం కావటానికి తొమ్మిదేళ్లు పడుతుందా? అన్న మాటలో మాత్రం న్యాయం ఉందని చెప్పక తప్పదు.