తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా ఉంది. ఇంకా చెప్పాలంటే… ఉద్రిక్తంగా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సవాళ్లు చేసుకున్నారు. రాజకీయాలు అన్నాక సవాళ్లు.. ప్రతిసవాళ్లు మామూలే. అయితే.. ఇవన్ని నోటి మాటలకే కానీ.. చేతల వరకు రావు. అందుకు భిన్నంగా ఏపీలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సవాళ్లు కాస్తా మరింత ముదిరి.. దేవుడి మీద ప్రమాణం చేస్తారా? అన్న దాకా వచ్చింది.
బిక్కవోలు దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దేవుడిపై సత్య ప్రమాణం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రమాణం చేస్తానంటే పోలీసు బందోబస్తు కూడా నేనే ఏర్పాటుచేస్తాను అని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేల రివర్సులో నల్లమిల్లిని గృహనిర్బంధం చేయించారు. అంతేకాదు ప్రమాణం చేయడానికి ఎమ్మెల్యే వెనక్కు తగ్గారు. దీంతో ఆయన ఆయన పిరికిపందనా? ఆడంగా? ఎందుకు దాక్కున్నారు ప్రమాణం చేయకుండా అని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి… ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై విమర్శలు చేశారు.
దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరువు పోతుందని… అనపర్తి ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి కూడా ప్రమాణం చేశారు. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తన భార్యతో కలిసి గుడికి వచ్చారు. గుడిలో దేవుడి ముందు ప్రమాణం చేశారు. అనంతరం సవాలుకు ప్రతిగా తన భార్య ప్రమాణం చేస్తే.. మాజీ ఎమ్మెల్యే సతీమణి మాత్రం ప్రమాణం చేయలేదని ఎమ్మెల్యే సూర్య నారాయణ రెడ్డి ఆరోపించారు. అయితే… మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి సీరియస్ అయ్యారు.
సూర్యనారాయణరెడ్డివి అన్నీ అబద్ధాలే అని… తన భార్య ప్రమాణం చేసిన ఫొటోను విడుదల చేశారు. దీంతో ఎమ్మెల్యే పరిస్థితి దిక్కుతోచకుండా మారింది. బిక్కవోలులో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా పోలీసులు 144 సెక్షన్ విధించటంతో పాటు.. 200 మందికి పైగా పోలీసులతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్య ప్రమాణాలు చేతల వరకు రావటంతో.. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎక్కడికి వెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
అసలు విషయం ఏంటంటే… అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ అవినీతిలో మునిగితేలుతున్నారన్నది అసలు ఆరోపణలు. మైనింగ్‌తో సహా పలు అక్రమాలు ఉన్నాయని, ఇది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలను అన్నారు. సమాచార హక్కు ద్వారా సేకరించిన ఆధారాలు ఉన్నాయన్నారు. దీంతో ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయిపోయారు.