ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తున్నా…సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్టున్నారని, అందుకే ఏపీలో కరోనా కట్టడి కాలేదని విమర్శలు వస్తున్నాయి. ఇక, కరోనాపై చేతులెత్తేసిన జగన్… బ్లాక్ ఫంగస్ విషయంలోనూ థూథూ మంత్రంగా వ్యవహరించారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయి.
కరోనాపై జగన్ చేతులెత్తేశారంటూ వైసీపీ నేతలే చెబుతున్న నేపథ్యంలో తమను ఆదుకునేందుకు చంద్రబాబు మళ్లీ సీఎంగా పగ్గాలు చేపడితే బాగుండు అన్న అభిప్రాయాలను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు చంద్రబాబే దిక్కు అంటూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కరణం శ్రీవత్స అనే యువకుడు సోషల్ మీడియా చేసిన విజ్ఞప్తి వైరల్ అయింది.
తమ కుటుంబాన్ని కాపాడాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబును శ్రీవత్స వేడుకున్న వైనం పలువురిని కదిలించింది. బ్లాక్ ఫంగస్‌తో తమ తాత చనిపోతున్నా వైద్యులు పట్టించుకోలేదని, తన తాత పరమపదించారిని శ్రీవత్స ఆవేదనకు గురైన వైనం పలువురికి కంటతడి పెట్టించింది. తన తాతను కాపాడాలని బతిమాలినా వైద్యం చేయకపోగా… హేళన చేశారని శ్రీవత్స వాపోయాడు.
ప్రభుత్వాసుపత్రిలో దుర్భర పరిస్థితులున్నాయని, వాటిని తాను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేనని శ్రీవత్స పోస్ట్ చేశారు. అందుకే, తమ కుటుంబానికి చంద్రబాబే దిక్కని, తమను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవత్స విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత ఫోనులో శ్రీవత్స కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.