ఏదైనా లాభం ఉందంటే… దానిని నిర్దాక్షిణ్యంగా తన వశం చేసుకోవడంలో ఎవరు ఏమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ నేతలు వెనక్కు తగ్గరు.
పాపం ఆనందయ్య మందు వల్ల ఎంతో మంది పేద అభాగ్యులు రూపాయి ఖర్చు లేకుండా కరోనా ను నయం చేసుకుంటుండగా ఆయన పై వైసీపీ నేతలు కన్నేశారు.
రోజుకు 10 వేల మంది కరోనా నుంచి బయటపడేవారు ఆయన మందుతో.
ఆయన మందు గురించి తెలిసిన వెంటనే రకరకాల పరీక్షల పేరిట ఆయనను వైసీపీ నిర్బంధించింది.
ఆయన మందును పబ్లిక్ కి అందకుండా ఆపేసింది.
వైసీపీ నేతలు ఆనందయ్యను తమ అదుపులో ఉంచుకుని ఆయనను వంటవాడిగా తయారుచేసి మందును తయారుచేయిస్తూ దానిని తమకు కావల్సిన వారికి దేశ వ్యాప్తంగా పంపిణీ చేశారు వైసీపీ నేతలు.
జనాలకు మందును దక్కకుండా తమ స్వలాభానికి తమ రాజకీయ లాభానికి తమ పరపతి పెంచుకోవడానికి వాడుకున్నారు వైసీపీ నేతలు.
జనాలకు మాత్రం ఆ మందుపై పరీక్షలు చేస్తున్నాం అని చెప్పి కబుర్లు చెప్పారు.
ఈ భారీ స్కాంను ఆంధ్రజ్యోతి బయటపెట్టింది.
వీడియోలతో సచిత్రంగా బయటపెట్టి వైసీపీ దోపిడీ గుట్టు రట్టు చేసింది.
https://www.youtube.com/watch?v=y06Jfwj7PU8