రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని వైద్యశాలలో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆస్పత్రి ఛైర్మన్ కూచిబొట్ల ఆనంద్ తెలిపారు.
కూచిపూడి సిలికానాంధ్ర సంజీవని వైద్యశాలలో రూ.1.10 కోట్లతో ఏర్పాటు చేసిన మెగా ఆక్సిజన్ ప్లాంట్ను కూచిపూడి ప్రముఖ నాట్యాచార్యుడు పసుమర్తి రత్తయ్యశర్మ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ కొవిడ్ సమయంలో ఆక్సిజన్ కోసం రోగులు ఇబ్బందులు పడకూడదని ఈప్లాంట్ను దాతల సాయంతో ఏర్పాటు చేశామన్నారు.
అమెరికాకు చెందిన సేవ ఇంటర్నేషనల్ సంస్థ రూ.80 లక్షలు అందించగా సిలికానాంధ్ర కుటుంబం మరో రూ.30 లక్షలతో కలిపి ఈప్లాంట్ను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఆస్పత్రి సలహాదారుల ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వరరావు, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, చింతలపూడి జ్యోతి, చామర్తి రాజు(యూఎస్ఏ), సేవా సంస్థ ప్రతినిధి స్వాతి, డాక్టర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.