• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

భార‌తీయ వైద్యుల‌పై అమీ వ్యాక్స్ జాత్యాహంకార వ్యాఖ్య‌లు!

 ఖండించిన AAPI అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్క‌ల‌!!

NA bureau by NA bureau
May 8, 2022
in Around The World
0
భార‌తీయ వైద్యుల‌పై అమీ వ్యాక్స్ జాత్యాహంకార వ్యాఖ్య‌లు!
0
SHARES
306
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఫాక్స్ న్యూస్ టక్కర్ కార్ల్‌సన్ షోలో ఇటీవల ప్రొఫెసర్ అమీ వ్యాక్స్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్యలను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్క‌ల తీవ్రంగా ఖండించారు. భారతీయ వైద్యులపై ఆమె చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను తొల‌గించాల‌ని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ అధ్యక్షుడికి అనుప‌మ గొట్టిముక్క‌ల‌ లేఖ రాశారు.

యూనివర్శిటీ తక్షణమే వ్యాక్స్‌కు వ్యతిరేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆమె జాత్యహంకార వ్యాఖ్యల‌పై విచారణ జ‌రిగే వరకు ఆమెను గైర్హాజరులో ఉంచాలని అనుప‌మ అభ్య‌ర్థించారు.

వాక్స్ మూర్ఖత్వంతో చేసిన వ్యాఖ్య‌లు క్షమించరానివ‌ని పేర్కొన్నారు. అత్యంత దారుణ‌మైన ఈ వ్యాఖ్య‌ల‌పై బ‌హిరంగ క‌మిటీతో  విచారణను ప్రారంభించాలని కోరారు. వ్యాక్స్‌, యుపెన్ నుంచి క్షమాపణలు కోరాలని అభ్య‌ర్థించారు. ఇటీవలి ఫాక్స్ న్యూస్ నిర్వ‌హించిన షోలో అమీ వాక్స్ భారతదేశం ఒక ‘షిథోల్ కంట్రీ’ అని కొన్ని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోని భారతీయ వైద్యుల గురించి మతోన్మాద వ్యాఖ్యలతో పాటు బ్రాహ్మణ సామాజిక వ‌ర్గానికి చెందిన భారతీయ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు అమెరికాలోని భార‌త సంత‌తి వ‌ర్గంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో చ‌ర్య‌లు కోరుతూ.. అనుప‌మ గొట్టిముక్క‌ల పెన్సిల్వేనియా యూనివ‌ర్సిటీకి లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

వ్యాక్స్ ఇంటర్వ్యూ ఏప్రిల్ 18, 2022న ప్రసారం అయింది. 40 ల‌క్ష‌ల  మందికి పైగా ఉన్న‌ భారతీయ అమెరికన్ డయాస్పోరాలో వ్యాక్స్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర ఆవేద‌నను మిగిల్చిన‌ట్టు అనుప‌మ తెలిపారు. అమెరికా, భారతదేశాల మధ్య బలమైన ప్రజల-ప్రజల సంబంధాలను ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్య‌లు బాధించాయ‌న్నారు. ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌పై ఈ వ్యాఖ్య‌లు ప్ర‌భావం చూపుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

భార‌తీయ సంత‌తి వైద్యుల‌ భాగస్వామ్యం ఎంతో కీల‌క‌మైన అమెరికాలో.. ప్రొఫెసర్ వ్యాక్స్ భారతదేశాన్ని ‘షిథోల్ కంట్రీ’గా పేర్కొనడం అమెరికా-భారత సంబంధాల ప్రాథమిక ల‌క్ష్యాల‌ను నాశనం చేయడమే కాకుండా భారతీయ సంతతికి చెందిన వైద్యులపై ప్ర‌భావం ప‌డేలా చేసింద‌న్నారు. అంతేకాకుండా.. మహిళలపై కూడా ద్వేషపూరిత నేరాలను ప్రేరేపిస్తోందన్నారు.

1982లో స్థాపించబడిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) అమెరికాలో ల‌క్ష‌కు పైగా వైద్యుల సంఘ‌టిత శ‌క్తిగా ఉంద‌ని అనుప‌మ తెలిపారు. ఈ అసోసియేష‌న్  దేశంలో 40,000 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థులు, నివాసితులు, భారతీయ సంతతికి చెందిన సహచరులకు అనేక రూపాల్లో సేవ చేస్తోంద‌ని తెలిపారు.

AAPI YPS/MSRF (యంగ్ ఫిజిషియన్స్ విభాగం/మెడికల్ స్టూడెంట్స్, రెసిడెంట్స్ మరియు ఫెలోస్ సెక్షన్) అనేది AAPI యొక్క కీలకమైన, అంతర్భాగంగా పేర్కొన్నారు. AAPI నాయకత్వం  వైద్య రంగంలో వారి భాగస్వామ్యం, సహకారం అందించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంద‌న్నారు. అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒక‌రి ఆరోగ్య సంరక్షణలో ఏదో ఒక సమయంలో భారతీయ వైద్యులు సేవ‌లు అందిస్తున్నార‌ని వివ‌రించారు.

Tags: aapiamy vax
Previous Post

`అంతిమ` సంస్కారానికి ఆత్మీయ వీడ్కోలు!

Next Post

వివాదాల్లో విశాఖ ఎంపీ ?

Related Posts

పెరిగిపోతున్న గన్ కల్చర్
Around The World

పెరిగిపోతున్న గన్ కల్చర్

May 16, 2022
మగాళ్లూ ఊపిరి పీల్చుకోండి…  `బ‌ట్ట‌త‌ల‌` అని అవ‌మానిస్తే రేప్ కేసే
Around The World

మగాళ్లూ ఊపిరి పీల్చుకోండి… `బ‌ట్ట‌త‌ల‌` అని అవ‌మానిస్తే రేప్ కేసే

May 15, 2022
స్వామి నిత్యానంద బ్రతికున్నాట్లా? చనిపోయినట్లా? ఏంటీ కన్ఫ్యూషన్?
Around The World

స్వామి నిత్యానంద బ్రతికున్నాట్లా? చనిపోయినట్లా? ఏంటీ కన్ఫ్యూషన్?

May 14, 2022
పెళ్లయిన కాసేపటికే నిప్పంటించుకున్న వధూవరులు..వైరల్
Around The World

పెళ్లయిన కాసేపటికే నిప్పంటించుకున్న వధూవరులు..వైరల్

May 14, 2022
శ్రీలంకలో మొదలైన తిరుగుబాటు
Around The World

శ్రీలంకలో ప్రజల విజయం

May 13, 2022
విశాఖలో విషాదం..
Andhra

విశాఖలో విషాదం..

May 13, 2022
Load More
Next Post
వివాదాల్లో విశాఖ ఎంపీ ?

వివాదాల్లో విశాఖ ఎంపీ ?

Please login to join discussion

Latest News

  • అనంతపురం టీడీపీలో వర్గపోరుతో పార్టీకి చేటు తప్పదా?
  • బాలీవుడ్ పై టాలీవుడ్ అరాచకం…తగ్గేదేలే అంటోన్న వర్మ
  • త్వరలో టీడీపీలోకి మాజీ మంత్రి…ఇదే ప్రూఫ్
  • ఎప్పుడూ ఏడుపు ప‌వ‌న్ మీదేనా ! రూటు మార్చు జ‌గ‌న్ !
  • కుప్పంలో ఆ మహిళపై వైసీపీ నేతల గూండాయిజం…చంద్రబాబు ఫైర్
  • ఆ విషయంలో బాలయ్యే ఇండస్ట్రీ నెం.1
  • ఆ రెండు పార్టీల పొత్తుపై రఘురామ సంచలన వ్యాఖ్యలు
  • జగన్ కు షాక్…నారాయణ కుటుంబ సభ్యులకు హైకోర్టు ఊరట
  • పలాసలో ఏం జరుగుతోంది?
  • పెరిగిపోతున్న గన్ కల్చర్
  • సాయిరెడ్డి గాలి తీసిన లేడీ సింగం
  • చంద్రబాబుకు చేసింది చెప్పుకోవడం చేతకాదా?
  • Photo: ఎదలు విప్పి మనసు గిల్లింది… ఇంటర్నెట్ షేక్ అయ్యింది
  • వైసీపీకి రంకుమొగుడిలా తగులుకున్నాడే… వైసీపీకి షాకులే షాకులు
  • అడుక్కుంటున్న బండి సంజయ్.. ఫుల్ ట్రోలింగ్
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds