ఎప్పటికైనా టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని ధర్మారెడ్డి కలలు బూడిదలో పోసిన పన్నీరే నా?
టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డిని కేంద్రం వెనక్కి పిలిపించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.!
రక్షణ శాఖలో అధికారిగా పనిచేస్తున్న ధర్మారెడ్డి డిప్యుటేషన్‌పై మొదటగా టిటిడి ప్రత్యేక అధికారిగా.. తరువాత ఆ పోస్టును అదనపు ఈవోగా మార్పించుకుని.. తాజాగా ఇంఛార్జి ఈవో బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. హైదరాబాదులో ఆర్మీ ఆసుపత్రిలో జరిగిన కుట్రకు సూత్రదారి, తెర వెనుక పాత్రదారి ధర్మారెడ్డే అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్సింగ్కు ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఎంపీ రఘురాంకృష్ణం రాజు ఫిర్యాదు చేసినట్లు అధికార వర్గాల భోగట్టా.
ఎప్పటికైనా టిటిడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని ధర్మారెడ్డి కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు సిఎంవో అధికారులు, సలహాదారుల సూచనలతో ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కెపి.రెడ్డితో ఉన్న పరిచయాన్ని అనుకూలంగా మలుచునేందుకు చేసిన ప్రయత్నాలు ముందుగానే తెలుసుకున్న రఘురాంరాజు ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ధర్మారెడ్డికి, కెపి.రెడ్డికి, పాలకులకు తిరిగి కోలుకోలేనంతగా షాక్ ఇచ్చారు.
అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించని.. ధర్మారెడ్డిపై అటు పాలకులు, ఇటు సలహాదారులు కూడా అసంతృప్తిగా ఉన్నారని.. ధర్మారెడ్డి విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే ఆమోదించాలే తప్ప ధర్మారెడ్డిని మళ్లీ భుజాన వేసుకోకూడని.. పాలకులు, సలహాదారులు, సిఎంవో అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
రక్షణ శాఖకు చెందిన అధికారి అయిన ధర్మారెడ్డిపై ఆధారాలతో తాను ఫిర్యాదు చేశానని. ఆయనపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవటం ఖాయమని ఎంపీ రఘురాంరాజు తెర వెనుక అంటున్నట్లు బయటకు పొక్కింది. ఇప్పటికే.. ఆర్మీ ఆసుపత్రి ఎపిసోడ్లో పరోక్ష భాగస్వామిగా వ్యవహరించిన గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసి మళ్లీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవటంతో.. ఇక ధర్మారెడ్డికి కూడా అదే పరిస్థితి ఎదురవటం ఖాయమంటున్నారు.
అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఏదో సాధించాలని ఆశపడ్డ ధర్మారెడ్డికి ముందు ముందు అసలైన కష్టాలు ఎదురు కాబోతున్నాయని.. అధికారులు అంటున్నారు. టిటిడి ఈవో పదవిని ధర్మారెడ్డి కావాలనుకుంటే.. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న ఎంపీ రఘురాంకృష్ణం రాజును మళ్లీ ఏదో విధంగా ఇబ్బంది పెడితేనే..ఆ పోస్టు మీకు దక్కుతుందని.. ధర్మారెడ్డికి అటు సహాదారులు, ఇటు ముఖ్య అధికారులు చెప్పిఉంటారని.. టిటిడి లో ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనప్పటికీ.. ధర్మారెడ్డి అనవసరంగా ఎంపీ RRR కేసులో తలదూర్చి తిరిగి లేవలేనంతగా పూర్తిగా కూరుకుపోయారని..ఆ యనను కేంద్రం వెనక్కి పిలిపించటం ఖాయం.. ధర్మారెడ్డిచేసిన పనులకు RRR ఆధారాలు కూడా సేకరించారని.. కధ క్లైమాక్స్‌కి వచ్చింది. రేపో మాపో ధర్మారెడ్డికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతోందో వేచి చూడాల్సిందే అంటున్నారు అధికారులు.