వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో ఆపార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆయనను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించడంతోపాటు.. ఎక్కడికక్కడ.. రఘురామను కించపరిచేలా వ్యాఖ్యానించడం.. తెలిసిం దే. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించిన పాపానికి ఆయనను పార్టీ నుంచి దూరంగా ఉంచిన విషయం.. ఆయనపై కక్ష కట్టిన విషయం.. ఇప్పటికే చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని.. ఆయనపై ఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి.. ఆయన దోషో నిర్దోషో తేల్చేయాలని .. కోరుతూ.. రఘురామ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత.. మరింతగా ఆయనపై వైసీపీ నేతల దూకుడు పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, నందిగం సురేష్, వంటివారు.. ఆర్ ఆర్ ఆర్ సెంట్రిక్‌గా రాజకీయాలు చేస్తసున్న విషయం తెలిసిందే. అంటే.. ఆయనను దూషించడం.. నెటిజన్ల పేరుతో.. కామెంట్లు చేయడంతోపాటు.. ప్రజాస్వామ్య దేవాలయం వంటి.. పార్లమెంటులోనే బూతులు కుమ్మరించడం.. బెదిరింపులకు పాల్పడడం వంటివి చేస్తున్నట్టు తరచుగా.. ఆర్ ఆర్ ఆర్ మీడియా ముందుకు వచ్చి వాపోతున్న విషయం తెలిసిందే. ఈ విధమైన దూషణల నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్.. పార్లమెంటు స్పీకర్‌కు.. ఇటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ. కేంద్రం ఏం చేస్తుందని అనుకున్నారో.. ఏమో.. వైసీపీ ఎంపీలు.. సొంత పార్టీ నేతే అయినప్పటికీ.. ఆర్ ఆర్ ఆర్‌ను దూషిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా గోరంట్ల మాధవ్ తనను లేపేస్తానంటూ.. చేసిన వార్నింగ్‌పై ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తనకు భద్రత పెంచాలని కోరారు. ఎంపీ గోరంట్ల మాధవ్ తనను చంపేస్తాంటూ పార్లమెంటు 4వ గేటు వద్ద బెదిరించిన విషయాన్ని ఆయన షా దృష్టికి తీసుకువెళ్లి.. చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై స్పందించిన షా.. ఆర్ ఆర్ ఆర్ చేసిన ఫిర్యాదు తనకు అందిందని ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ప్రత్యుత్తరం పంపారు. “మీరు పంపిన లేఖ అందింది. విషయం తెలుసుకున్నాను“ అంటూ షా ప్రత్యుత్తరంలో పేర్కొన్నారు. దీంతో రఘురామరాజుకు ఒకింత ఊరట లభించినట్టు అయింది.
వైసీపీ ఎంపీ గోరంట్ల బెదిరింపుపై ఈనెల 8న ప్రధాని, స్పీకర్, కేంద్ర హోం మంత్రులకు ఎంపీ రఘురామ లేఖలు రాశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ తనను బెదిరించారని ఎంపీ అందులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా..పార్లమెంటులో నందిగం సురేష్.. `లం..కొ..క` అంటూ.. తనను దూషించారని.. మరోసారి.. రఘురామ రాజు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మరి వీరిపై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.