కొంతకాలంగా బీజేపీ, వైసీపీల మధ్య గ్యాప్ వచ్చిందని, అందుకే బీజేపీ నేతలపై వైసీపీ నేతలు విమర్శల తీవ్రతను పెంచారని టాక్ వస్తోంది. జగన్ చేస్తున్న అప్పులపై కేంద్రం సీరియస్ గా ఉండడం…కేంద్రం నిధులను తన హామీల అమలుకు వాడేసి క్రెడిట్ ను తన ఖాతాలో వేయడం వంటివి బీజేపీ పెద్దలకు రుచించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జగన్ ను మోడీ దూరం పెడుతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే, తమ మధ్య మైత్రిబంధం అలాగే ఉందని తెలిపేందుకు జగన్ నానా తిప్పలు పడ్డారు. తిరుపతిలో జరిగిన సదస్సుకు హాజరైన జగన్…ఆ తర్వాత వెంకన్న స్వామి విగ్రహాన్ని ఇచ్చి అమిత్ షాను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ఇన్నీ చేసినా..జగన్ కు ఫలితం దక్కలేదు. తాజాగా జగన్ మానస పుత్రిక…వైసీపీ పత్రిక అయిన సాక్షిపై అమిత్ షా చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
బీజేపీ కార్యక్రమాలకు రాకుండా ‘ఏబీఎన్’, ‘ఆంధ్రజ్యోతి’ని ఎందుకు బహిష్కరించారంటూ రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలను అమిత్ షా నిలదీయడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు, బీజేపీ వార్తలను కవర్ చేయని సాక్షి మీడియాను బహిష్కరించాల్సింది పోయి…పేరున్న ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ మీడియా సంస్థను ఎలా బహిష్కరిస్తారని షా నిలదీశారట. ప్రజావ్యతిరేక విధానాలపై వార్తలు రాసే సంస్థ ఏదైనా సరే సమర్ధించాల్సిందేనని షా తేల్చి చెప్పారు.