తెలంగాణలో సంచలన పరిణామం తెరమీదకి వచ్చింది. మీడియా మొఘల్‌గా పేరున్న `ఈనాడు` సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావుతో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. సుమారు గంట పాటు.. తనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలంటూ.. అమిత్ షానే.. రామోజీరావుకు ఫోన్ చేసి కోరినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక.. మరోవైపు.. రాష్ట్రంలో బీజేపీ పునాదులు వేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో కీలక మీడియా అధిపతి రామోజీరావును అమిత్ షా భేటీ కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
మధ్యాహ్నం 3.40 గంటలకు అమిత్‌షా శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా 4.15 గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అక్కడ 4.35 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో కాసేపు సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం 4.40 నుంచి 6 గంటల వరకు బీజేపీ నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక బహిరంగసభలో షా ప్రసంగించనున్నారు. ఈ సభ ముగిసిన వెంటనే రోడ్డు మార్గంలో రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. రామోజీ ఫిలిం సిటీలో 6.30 నుంచి 7.30 వరకు ఉంటారు. ఈ సందర్భంగా రామోజీతో రహస్యభేటీ ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
అనంతరం శంషాబాద్ లోని నొవోటెల్ హోటల్ చేరుకుంటారు. అక్కడ 8 నుంచి 9.30 గంటల వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారు. అనంతరం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
రామోజీ చర్చలకు ప్రాధాన్యం ఏంటి?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రామోజీ రావుకు రాజకీయంగా కొట్టిన పిండి. ప్రభుత్వాలను పడగొట్టాలన్నా..నిలబెట్టాల
ఇక, 2015లో మోడీ ప్రభుత్వం హయాంలోనే రామోజీరావుకు ప్రతిష్టాత్మక “పద్మవిభూషణ్` అవార్డు లభించింది. ఇక, మోడీ సూచనల మేరకు కావొచ్చు.. `దేశభక్తి` కావొచ్చు.. గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పత్రికాముఖంగా ఏడాదిపాటు రామోజీరావు నిర్వహించారు. అదేవిధంగా ప్రస్తుతం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను కూడా పత్రికా ముఖంగా ప్రముఖంగా ఆయన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీకి.. రామోజీకి.. మధ్య ఎడతెగని బంధం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పావులు కదుపుతున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా రామోజీని వినియోగించు కునే ఉద్దేశం బీజేపీకి ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ.. అంత బలంగా బీజేపీ పెద్దలు చెబుతున్నారని.. దీని వెనుక.. `కొందరి`మద్దతు ఉందనే ధైర్యం వారికి ఉందని..ఇలాంటి వారిలో రామోజీ కూడా ఉండి ఉండచ్చని అంటున్నారు. అయితే.. కేంద్రంలోరాజకీయాలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ సర్కారుకు రామోజీ అనుకూలంగా ఉన్నారనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో అమిత్ షా భేటీ.. అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.