సెంట్రల్ ఒహయో లొ ఆప్కో (ఆంధ్ర పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఒహయో) నిన్న నిర్వహించిన అట్లతద్ది ఆంధ్రా సంప్రదాయ పద్దతిలొ దాదాపు 60 మంది మహిళలు ఎంతో ఉత్సహంగా తెల్లవారుజామున 3 గంటలనుండి రాత్రి వరుకు ఉపవాసముండి శాస్త్రోక్తంగా గౌరి పూజతొ పాటు అన్ని పద్దతులను ఎంతో నిష్థగా పాటించి వాయణాలు ఇచ్చుకొవదం పుచ్చుకొవదంతో పరిపూర్ణముగా వ్రతాన్ని పూర్తి చేసి చంద్రోదయం తరువాత 30 పైగా ఆంధ్రా సంప్రదాయక వంతకాలతొ విందు భొజనాన్ని ఆస్వాదించారు. తరువాత స్టార్ మహిళా వినొధ కార్యక్రంలొ అందరు పాల్గొని ఇదుగురు మహిళలు విజేతలుగా నిలిచారు.
ఈవిదంగా అమెరికలో అట్లతద్ది జరగటము ఇదే మొదట సారి కావడం విశేషం. గత 2 సంవత్సరాలుగా ఆప్కో విన్నూత్నమైన కార్యక్రమలతో అతితక్కువ సమయంలొ తెలుగు వారికి అత్యంత చేరువయ్యన సాంస్కృతిక సేవసంస్థ ఆప్కో కార్యనివహక కమిటీ అధ్యక్షురాలు’ సుశీల ఉప్పుటూరి’ (అమెరికాలో నిస్వార్ధ తెలుగు కమ్యూనిటీ వాలంటీర్ గా పేరున్న ‘రామ్ చౌదరి ఉప్పుటూరి’ స్వయాన సోదరి) అధ్వరంలొ విజయవంతంగా నిర్వహింపబడింది. కార్యనివహక కమిటీసభ్యులు వేణు పసుమర్తి, రవి నవులూరి, అపర్ణ సంగా, వాణి గద్దె,అనిత ఈడ్పుగంటి, ఉమ మునగాల, వీరేష్ ఊల్లిగడ్ల, రాజ బొమ్మన,వెంకట అరవీటి,నూక రాజు, లత సాదినేని, జయ యర్రంశెట్టి, మాధవి పుట్టి మరియు స్వచ్ఛంద సేవకులు లో న భూతొ న భవిష్యతి అనుకోనె విదంగా ఘనంగా నిర్వ్హించారు.